హనీ రోజ్ అతిపెద్ద సాహసం.. అలాంటి ప్లేసులో ముద్దు.. ఆ అనుభవం మర్చిపోలేనంటూ!
హనీ రోజ్.. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువగా వినిపించిన పేరు. అప్పుడెప్పుడో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి మళ్లీ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చింది. మలయాళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ భామ నందమూరి నటసింహం బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాతో తెలుగులోకి మళ్లీ అడుగు పెట్టింది. ఇందులో గ్లామర్ లుక్ తో హొయలు పోవడమే కాకుండా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అయితే తాజాగా హనీ రోజ్ చేసిన హై రిస్క్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఫ్యామిలీ : మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ అసలు పేరు హనీ రోజ్ వర్గీస్. ఈ బ్యూటిఫుల్ సుందరికి ధ్వని, పొన్ను అని ముద్దు పేర్లు సైతం ఉన్నాయి. హనీరోజ్ 1989 మే 17వ రోజున కేరళలోని మూలమట్టం అనే గ్రామంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కాగా సెయింట్ జేవియర్స్ వుమెన్ కాలేజీలో ఇంగ్లీషులో బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది.

14వ ఏటలో : తేనేకళ్ల సుందరి హనీరోజ్ నటన డ్యాన్స్ పై మక్కువతో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. హనీ రోజ్ తన 14వ ఏటలో 2005లో "బాయ్‌ఫ్రెండ్" చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో ఈ బ్యూటి సపోర్టింగ్ పాత్రలో అలరించింది. అనంతరం ముధల్ కనవే అనే తమిళ్ రొమాంటిక్ డ్రామా మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

వెండితెరపై : ఇక 2009 నుంచి హాని రోజ్ అసలు సినీ కెరీర్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. మొదట్లో అనేక షార్ట్ ఫిల్మ్‌లలో నటించి ఆకట్టుకుంది. ఆ తరువాత మెల్లిగా ఈ అమ్మడు వెండితెరపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించి అలరించింది హనీ రోజ్.

ఆలయంతో : మలయాళ చిత్ర పరిశ్రమలో హనీ రోజ్ "త్రివేండ్రం లాడ్జ్," "హోటల్ కాలిఫోర్నియా," "కుంబళంగి నైట్స్" వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. అలాగే 2008లో ఆలయం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హనీరోజ్. అనంతరం 2014లో వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించింది. ఇటీవల వీరసింహారెడ్డితో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ప్రసిద్ధి చెందిన : ఇదిలా ఉంటే సినిమాలతో బిజీగా ఉన్న హనీ రోజ్ తాజాగా చేసిన భారీ రిస్క్ హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల ఐర్లాండ్ టూర్ కు వెళ్లిన హనీ రోజు ఆ దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బ్లర్నే స్టోన్ (బ్లర్నే అనే రాయి)ని రిస్క్ చేసి మరీ ముద్దు పెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
తలను వెనక్కి వాల్చి : హనీ రోజ్ షేర్ చేసిన ఈ వీడియోలో చాలా ఎత్తులో వెల్లకిలా పడుకున్న ఈ ముద్దుగుమ్మ తలను వెనక్కి వాల్చి అపోజిట్ డైరెక్షన్ లో రాయిని కిస్ చేసింది. "ఈ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, ఇదొక అద్భుతమైన అనుభవం" అంటూ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ మలయాళీ భామ హనీరోజ్.


Click it and Unblock the Notifications











