అన్ని వదిలేసిన బాలయ్య హీరోయిన్ .. పబ్లిక్‌గా అక్కడ ముద్దు పెడుతూ , వీడియో వైరల్
సోషల్ మీడియా రాకతో హీరో హీరోయిన్లు అభిమానులతో బాగా టచ్‌లో ఉంటున్నారు. సినిమాలు , వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. కొందరు లిమిట్స్‌లో ఉంటే మరికొందరు మాత్రం తెగించినట్లుగా బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటి వాటి కోసమే కాచుకుని కూర్చొనే గాసిప్ రాయుళ్లు .. హీరోయిన్లు ఫోటో పెట్టడం ఆలస్యం వెంటనే ట్రోలింగ్ మొదలు పెడతారు. తాజాగా ఇలాంటి వారి బారినపడ్డారు హీరోయిన్ హనీ రోజ్. ఈ వివరాల్లోకి వెళితే..
హనీరోజ్ పూర్తి పేరు హనీరోజ్ వర్గీస్. 1991 సెప్టెంబర్ 5న కేరళలో జన్మించిన ఆమె డిగ్రీ వరకు చదువుకున్నారు. 14 ఏళ్ల చిన్న వయసులోనే హనీరోజ్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 2005లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన బాయ్‌ఫ్రెండ్ అనే సినిమాలో నటించారు. 2008లో తెలుగులో శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాలో హీరోయిన్‌గా మెరిశారు. అయితే ఆ సినిమా జనాదరణ దక్కించుకోకపోవడంతో టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు , అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో తమిళ్, మలయాళ పరిశ్రమలలోనే అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్న హనీరోజ్ ఆ దిశగా ప్రయత్నాలు చేశారు.

మలయాళంలో త్రివేండ్రం లాడ్జి, హోటెల్ కాలిఫోర్నియా, థ్యాంక్యూ, యూ టూ బ్రూటస్ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చి స్టార్ హీరోయిన్‌ను చేశాయి. ఏకంగా అగ్రనటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి, జయరామ్, దిలీప్‌ల సరసన నటించే చాన్స్ కొట్టేశారు. ఈ పాపులారిటీతో చాలా రోజుల తర్వాత తెలుగులో హనీరోజ్‌కు అదృష్టం తలుపు తట్టింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డిలో ఆమె హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఇందులో బాలయ్యకు తల్లిగా ఆమె నటించారు.
ఒకే ఒక్క సినిమాతో ఆమె టాలీవుడ్ కుర్రాళ్లను తన అందంతో గిలిగింతలు పెట్టింది . వీరసింహారెడ్డి తర్వాత హనీరోజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్లు పెరిగారు. దీంతో టాలీవుడ్‌ని హనీరోజ్ దున్నేస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా ఆమెకు రాలేదు. అయినప్పటికీ ఓపెనింగ్స్ , బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ప్రమోషనల్ కార్యక్రమాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు హనీరోజ్.
నిత్యం ఎక్కడో , ఓ చోట ఖచ్చితంగా ఓపెనింగ్‌లో పాల్గొనడం దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం హనీరోజ్ దినచర్యగా పెట్టుకున్నట్లుగా ఉంది. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొట్టడంలోనూ ఈమె ముందుంటుంది. తాజాగా హనీరోజ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెడ్ కలర్ డ్రెస్‌లో నడుచుకుంటూ వస్తూ.. కెమెరాకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పారు. ఎర్ర దొండపండు లాంటి పెదాలు, భారీ అందాలతో ఆమె మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియో చూసేయ్యండి మరి.


Click it and Unblock the Notifications











