Honey Rose: బికినీకి ధీటుగా హనీ రోజ్ ఓపెన్ హాట్ షో.. అలాంటి డ్రెస్సులో ఎక్స్‌పోజింగ్!
హనీ రోజ్.. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువగా వినిపించిన పేరు. అప్పుడెప్పుడో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చింది. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమాతో తెలుగులోకి మళ్లీ అడుగు పెట్టిన ఈ సుందరి విపరీతమైన క్రేజ్ అందుకుంది.
ఒక్క సినిమాతోనే తెగ పాపులర్ అయింది. ఇక హనీ రోజ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో నిప్పు రాజేస్తుంది. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ షేర్ చేసి తెగ హైలెట్ అవుతోంది.

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్: తెలుగు రాష్ట్రాల్లో తెగ ట్రెండ్ అయిన ముద్దుగుమ్మ హనీ రోజ్ అసలు పేరు హనీ రోజ్ వర్గీస్. 1989 మే 17వ రోజున కేరళలోని మూలమట్టం అనే గ్రామంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. మూలమట్టంలోని షెమ్ ఉన్నత పాఠశాలలో చదివిన ఈ భామ సెయింట్ జేవియర్స్ వుమెన్ కాలేజీలో ఇంగ్లీషులో బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది.

ముందుగా ఆ పాత్ర: మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్ పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత నటన డ్యాన్స్ పై ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. తర్వాత 14వ ఏటా 2005లో "బాయ్‌ఫ్రెండ్" చిత్రంతో మలయాళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటి. ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన ఈ గ్లామరస్ భామ "ముధల్ కనవే" అనే తమిళ రొమాంటిక్ డ్రామా సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

వెండితెరపై ఫోకస్: ఇక 2009 నుంచి హాని రోజ్ అసలు సినీ కెరీర్ స్టార్ట్ అయ్యింది. మొదట్లో ఆమె అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేయకుండా తనని తాను నిరూపించుకోవాలనుకుంది. అందుకే అనేక షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో హనీ నటనకు ప్రశంసలు లభించాయి. ఇక ఆ తరువాత మెల్లగా ఈ అమ్మడు వెండితెరపై ఫోకస్ చేసింది.

మంచి పాపులారిటీ: ఈ క్రమంలోనే స్టన్నింగ్ బ్యూటి హనీ రోజ్ మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించడం ప్రారంభం చేసింది. మలయాళంలో "త్రివేండ్రం లాడ్జ్," "హోటల్ కాలిఫోర్నియా," "కుంబళంగి నైట్స్" వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఈ సినిమాలతో మాలీవుడ్ లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది హనీ రోజ్. అలాగే అప్పట్లో తమిళ తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

ప్రముఖ దర్శకుడితో: తెలుగులోకి బొద్దుగుమ్మ హనీ రోజ్ 2008లో "ఆలయం" సినిమాతో అడుగు పెట్టింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తన 50వ చిత్రంగా తెరకెక్కించారు. ఇందులో హీరోగా శివాజీ నటించాడు. బ్రహ్మానందం, కోవై సరళ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. అనంతరం 2014లో వరుణ్ సందేశ్ హీరోగా చేసిన "ఈ వర్షం సాక్షిగా" అనే సినిమాలో నటించింది.
తల్లిగా కనిపించి: ఇక హనీ రోజ్ ఇటీవల ఊహించిన విధంగా నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె వీరసింహారెడ్డి పాత్రకు జోడిగా మాత్రమే కాకుండా యంగ్ బాలయ్యకు తల్లిగా కూడా కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. హనీ రోజ్ గ్లామర్ కు, నటనకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అయ్యారు.
బ్రిటీష్ యువతిగా: ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హనీ రోజ్ సోషల్ మీడియాలోనూ తెగ హడావిడి చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఆమె నిత్యం హాట్ ఫొటోలు పెడుతూ అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని దర్శనం ఇచ్చింది ఈ స్టన్నింగ్ బ్యూటి హనీ రోజ్. పైన హ్యాట్, దానిపై ఫ్లవర్ తో బ్రిటీష్ యువతిగా తన మెరిసే అందాలతో బికినీకి కూడా ధీటుగా హాట్ షో చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











