Honey Rose: పైట లేకుండా బీఫ్ కొడుతున్న హనీ రోజ్.. బ్యాన్ చేయమంటూ ఫైర్
నందమూరి నటసింహం బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసి మాసివ్ హిట్ కొట్టిన రీసెంట్ మూవీ వీరసింహా రెడ్డి. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అలరించింది మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్. అప్పుడెప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటికి అప్పుడు హిట్ రాలేదు.
కానీ, ఇటీవల వీర సింహా రెడ్డి సినిమాతో మాత్రం ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో హనీ రోజ్ అంటే తెలియని వారుండరు అనేంతలా పాపులరారిటీ తెచ్చుకుంది. అయితే తాజాగా హనీ రోజ్ చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

హనీ ఫ్యామిలీ: స్టన్నింగ్ బ్యూటి హనీ రోజ్ అసలు పేరు హనీ రోజ్ వర్గీస్. ఈ బ్యూటిఫుల్ భామకు ధ్వని, పొన్ను అని ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. హనీరోజ్ 1989 మే 17వ రోజున కేరళలోని మూలమట్టం అనే గ్రామంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కాగా సెయింట్ జేవియర్స్ వుమెన్ కాలేజీలో ఇంగ్లీషులో బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది.

సపోర్టింగ్ రోల్: ది మోస్ట్ బ్యూటిఫుల్ హనీరోజ్ నటన డ్యాన్స్ పై మక్కువతో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. హనీ రోజ్ తన 14వ ఏటా 2005లో "బాయ్‌ఫ్రెండ్" సినిమాతో మాలీవుడ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో ఈ బ్యూటి సపోర్టింగ్ పాత్రలో అలరించింది. అనంతరం ముధల్ కనవే అనే తమిళ్ రొమాంటిక్ డ్రామా మూవీతో కోలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది ఈ భామ.

షార్ట్ ఫిలిమ్స్: ఇక 2009 నుంచి హాని రోజ్ అసలు సినిమా కెరీర్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. మొదట్లో ఆమె అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేయకుండా తనని తాను నిరూపించుకోవాలనుకుంది. అందుకే అనేక షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో హనీ నటనకు ప్రశంసలు లభించాయి. ఇక ఆ తరువాత మెల్లిగా ఈ అమ్మడు వెండితెరపై ఫోకస్ చేసింది.

ఆలయం ద్వారా: షార్ట్ ఫిల్మ్స్ తర్వాత మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించి ఆకట్టుకుంది హనీ రోజ్. మలయాళ చిత్ర పరిశ్రమలో హనీ రోజ్ "త్రివేండ్రం లాడ్జ్," "హోటల్ కాలిఫోర్నియా," "కుంబళంగి నైట్స్" వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. 2008లో వచ్చిన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఆలయం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హనీరోజ్.
ఫస్ట్ లుక్: ఆలయం తర్వాత 2014లో వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించింది. ఇటీవల వీరసింహారెడ్డితో అత్యంత ఆదరణ పొందింది. దీంతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె కనిపిస్తే చాలు రోడ్స్ బ్లాక్ అయ్యేంతా ఫేమ్ తెచ్చుకుంది. అయితే హనీ రోజ్ తాజాగా నటించిన చిత్రం రేచల్. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియోని రిలీజ్ చేశారు.

బ్యాన్ చేయాలి: రేచల్ మూవీలో హనీ రోజ్ ఒంటిపై పైట లేకుండా బీఫ్ కొడుతూ వయెలెంట్ గా దర్శనం ఇచ్చింది. చుట్టూ గేదె మాంసంతో హనీ రోజ్ తీక్షణంగా చూస్తున్న ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. బీఫ్ అమ్మె పాత్ర చేస్తున్న హనీరోజ్ ను, ఆమె సినిమాను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎటు వెళ్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











