Honey Rose: నా బాడీ గురించి అతడు అలా నీచంగా.. హనీరోజ్ షాకింగ్ కామెంట్స్
నందమూరి నటసింహం బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసి మాసివ్ హిట్ కొట్టిన రీసెంట్ మూవీ వీరసింహా రెడ్డి. ఈ మూవీలో ఒక హీరోయిన్ గా అలరించింది మలయాళ భామ హనీ రోజ్. అప్పుడెప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటి వీర సింహా రెడ్డి సినిమాతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హనీ రోజ్ అంటే తెలియని వారుండరు అనేంతలా పాపులర్ అయింది. ముఖ్యంగా మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అనే పాటతో అదరగొట్టింది. అయితే తన బాడీపై నీచంగా మాట్లాడిన వ్యక్తిపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

అందులో డిగ్రీ పట్టా: హాట్ బ్యూటి హనీ రోజ్ అసలు పేరు హనీ రోజ్ వర్గీస్. ఈ బ్యూటిఫుల్ లేడీకి ధ్వని, పొన్ను అని ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. హనీరోజ్ 1989 మే 17వ రోజున కేరళలోని మూలమట్టం అనే గ్రామంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కాగా సెయింట్ జేవియర్స్ వుమెన్ కాలేజీలో ఇంగ్లీషులో బ్యాచ్ లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది.

తమిళ్-మలయాళం: ముద్దుగుమ్మ హనీరోజ్ నటన డ్యాన్స్ పై మక్కువతో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. హనీ రోజ్ తన 14వ సంవత్సరంలో 2005లో "బాయ్‌ఫ్రెండ్" చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో ఈ బ్యూటి సపోర్టింగ్ పాత్రలో అలరించింది. అనంతరం ముధల్ కనవే అనే తమిళ్ రొమాంటిక్ డ్రామా మూవీతో కోలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది ఈ భామ.

మెల్లిగా అడుగులు: ఇక 2009 నుంచి హాని రోజ్ అసలు సినీ కెరీర్ స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. మొదట్లో ఆమె అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేయకుండా తనని తాను నోరూపించుకోవాలనుకుంది. అందుకే అనేక షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో హనీ నటనకు ప్రశంసలు లభించాయి. ఇక ఆ తరువాత మెల్లిగా ఈ అమ్మడు వెండితెరపై ఫోకస్ చేసింది.

అప్పట్లోనే తెలుగులో: ఈ క్రమంలోనే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించింది ఆకట్టుకుంది హనీ రోజ్. మలయాళ చిత్ర పరిశ్రమలో హనీ రోజ్ "త్రివేండ్రం లాడ్జ్," "హోటల్ కాలిఫోర్నియా," "కుంబళంగి నైట్స్" వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. అలాగే అప్పట్లోనే తమిళ తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

అతను హీరోగా: 2008లో వచ్చిన ముత్యాల సుబ్బయ్య 50వ డైరెక్టెడ్ మూవీ ఆలయం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది హనీరోజ్. అనంతరం 2014లో వరుణ్ సందేశ్ ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించింది. ఇటీవల వీరసింహారెడ్డితో అత్యంత ఆదరణ పొందింది. ఇదిలా ఉంటే తాను గతంలో బాడీ షేమింగ్ కు గురైనట్లో ఓ ఇంటర్వ్యూలో తాజాగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటి.

పగలబడి నవ్వాడు: "నేను కెరీర్ మొదట్లో ఒక టీవీ షోకి వెళ్లాను. అక్కడ ఆ షో చూసేందుకు వచ్చిన ఒకతను నా బాడీ గురించి చెత్తగా మాట్లాడాడు. అతను అలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ఆ షో యాంకర్ పగలబడి నవ్వుతున్నాడు. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని మనసుకు బాధ కలిగిస్తాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడతున్నాను" అని హనీ తెలిపింది.


Click it and Unblock the Notifications











