వాటి సైజు ఎంత.. సర్జరీ చేయించుకోవచ్చుగా.. ఇలియానాకు దారుణంగా ట్రోలింగ్స్

శరీరాకృతి (బాడీ షేమింగ్)ని టార్గెట్‌గా నెటిజన్లు చేసే వేధింపులను ఎన్నోసార్లు అందాల భామ ఇలియానా డీ క్రజ్ ప్రస్తావించారు. కొన్నిసార్లు తనకు తాను సర్ధి చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా మారేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెటిజన్లు ఏ విధంగా మాటలతో హింస్తున్నారనే విషయాన్ని పట్టించుకోవద్దని అనుకొంటాను. కానీ కొన్నిసార్లు మానసికంగా వేదన గురయ్యే కామెంట్లు వినిపిస్తుంటాయి అని ఇలియానా తాజాగా ఓ ఇంటర్యూలో వెల్లడిస్తూ..

ఇన్స్‌టాగ్రామ్‌లో నాకు ఎలాంటి మెసేజ్స్ అంటే

ఇన్స్‌టాగ్రామ్‌లో నాకు ఎలాంటి మెసేజ్స్ అంటే

నా శరీరాకృతి విషయంలో వేధింపులకు గురికావడం నాకు కొత్త కాదు. బాల్యం నుంచే నాకు ఇలాంటి అనుభవాలను భరిస్తూ వస్తున్నాను. కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని విధంగా కామెంట్లు చేస్తుంటారు. నీ పిరుదుల సైజు ఎంత? సర్జరీ చేయించుకోవచ్చుగా, ఇన్స్‌టాగ్రామ్‌లో నాకు వచ్చే మెసేజ్‌లో కనీసం 10 మెసేజ్‌లు ఇలాంటివే ఉంటాయి అంటూ కామెంట్ చేస్తుంటారు అని ఇలియానా పేర్కొన్నారు.

నెటిజన్ల ట్రోల్స్‌తో

నెటిజన్ల ట్రోల్స్‌తో

కొన్నిసార్లు శరీరంలో కొన్ని పార్టులు అసహజంగా మారడానికి కారణాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల లోపం వల్ల చాలా రకాలుగా మార్పులు సంభవిస్తుంటాయి. అలాంటి పరిస్థితుల నుంచి మహిళలు తప్పించుకోలేరు. వాటి వల్ల శారీరకంగా బాధలే కాకుండా నెటిజన్ల నుంచి వచ్చే ట్రోల్స్ మరింత సమస్యల్ని తెచ్చిపెడుతుంటాయి అని ఇలియానా వెల్లడించారు.

నా శరీరాకృతిపై అలాంటి కామెంట్లు

నా శరీరాకృతిపై అలాంటి కామెంట్లు

ప్రతీ ఒక్కరికి ఒకరమైన శరీరాకృతి ఉంటుంది. అది వారి లోపంగా భావించకూడదనే విషయాన్ని నెటిజన్లు తెలుసుకోవాలి. నీ కాళ్లు అలా ఎందుకున్నాయి? నీ కింది భాగానికి ఏమైంది? అనే ప్రశ్నలను సంధిస్తుంటారు. దాంతో నా శరీరం మీద నాకే ఓ నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఓ రకమైన భయానికి లోనవుతాను అని ఇలియానా పేర్కొన్నారు.

నేను వైద్యులను సంప్రదిస్తే..

నేను వైద్యులను సంప్రదిస్తే..

ఇలాంటి వేధింపులు నా టీనేజ్ నుంచే ఉన్నాయి. వాటిని తట్టుకోలేక కొన్నిసార్లు వైద్యులను సంప్రదించాను. ఈ రకమైన సమస్యను డిస్మోర్ఫియా అంటారనే విషయాన్ని వాళ్లు వెల్లడించారు. అయితే ఈ రకమైన రుగ్మత వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చూసే వాళ్లు కామెంట్ చేయడం వల్ల ఓ రకమైన మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది అని ఇలియాన చెప్పారు.

Recommended Video

Jalsa Movie Philosophy And Review. it's 13 years for classic jalsa | Filmibeat Telugu
ఇలియానా కెరీర్ ఇలా...

ఇలియానా కెరీర్ ఇలా...

ఇలియానా కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్ సమయంలోనూ.. ఆ తర్వాత కూడా గ్రాఫ్ బాగుంది. ఇటీవల ఆమె నటించిన ది బిగ్‌ బుల్ చిత్రంలో అభిషేక్ బచ్చన్ సరసన నటించారు. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాతో కలిసి అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ అనే చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X