కన్నీళ్ళు తుడిచాడు.. అండగా ఉన్నాడు.. ప్రియుడి గురించి ఇలియానా ఏమోషనల్ కామెంట్స్
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా అందరికీ గుర్తుండే ఉంటుంది. జులాయి సినిమా తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు చేసినా కూడా సౌత్ లో లభించినంత ఆదరణ అయితే రాలేదని చెప్పాలి. అడపాదడపా అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరోలకు జోడిగా ఇలియానా కొన్ని చిత్రాలలో నటించింది. అయితే ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఇలియానా సడన్ గా ప్రెగ్నెన్సీ వార్తతో షాక్ ఇచ్చింది. భర్త ఎవరో సస్పెన్స్ లో పెట్టేసి అమ్మడు తరచు ఫొటోలు షేర్ చేస్తూ వచ్చింది. అయితే మొత్తానికి ఇటీవల తన బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
తల్లి కావడానికి కారణం ఎవరు?: చివరిగా ఆమె హిందీలో 2021లో బిగ్ బుల్ అనే మూవీలో అభిషేక్ బచ్చన్ కి జోడిగా నటించింది. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా కమిట్ అయిన కూడా అది ఇంకా రిలీజ్ కాలేదు. అయితే కొన్ని నెలల క్రితం తాను గర్భవతినని ఇలియానా బయటపెట్టి షాక్ ఇచ్చింది. అయితే తల్లి కావడానికి కారణం ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. గతంలో ఒక ఫారినర్ తో ఇలియానా కొంతకాలం డేట్ లో ఉంది. తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసింది.

కొంత డిప్రెషన్ కి కూడా గురైనట్లు..: ఆ సమయంలో కొంత డిప్రెషన్ కి కూడా గురైనట్లు బాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్న ఫోటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. తాజాగా మరోసారి ఇలియానా ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని ఇన్ స్టాలో పెట్టారు. ఇందులో ఆమె తన ప్రియుడు గురించి ఆసక్తికర విషయాలు పంచుకోవడం విశేషం.

ఏమోషనల్ పోస్ట్: తాను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ధైర్యంగా నా వెంట నిలిచాడు. కన్నీళ్లు తుడిచాడు అంటూ బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఇలియానా రివీల్ చేశారు. తల్లి కావడం అనేది ప్రతి అమ్మాయి జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతి. ప్రస్తుతం నేను దానిని ఆస్వాదిస్తున్నాను. ఇలాంటి ఆనందం పొందుతానని ఎప్పుడూ అనుకోలేదు. మనలో ఒక జీవి ప్రాణం పోసుకుంటుందనే అనుభూతి ఎంతో గొప్పగా ఉంది.
కన్నీళ్లు తుడిచి చిరునవ్వులు అందించాడు..:త్వరలో నిన్ను కలుసుకుంటాను అంటూ పుట్టబోయే బిడ్డ గురించి తన ఆనందాన్ని ఇన్ స్టాలో ఇలియానా పంచుకున్నారు. నా గురించి నేను పూర్తిగా మర్చిపోయిన రోజుల్లో నాకు అండగా నిలిచి ధైర్యాన్ని నింపాడు. కన్నీళ్లు తుడిచి చిరునవ్వులు అందించాడు. నాకు ఏం కావాలో అర్థం చేసుకొని నా పక్కనే నిలబడ్డాడు. ఇకపై ఏది కూడా కష్టం అనిపించదు అంటూ ఇలియానా తన ప్రియుడిపై ఉన్న ప్రేమని వ్యక్తం చేశారు. ఇన్ స్టాలో ఇలియానా పెట్టిన ఈ పోస్ట్ చూసిన తర్వాత తన భాగస్వామిపై ఎంత ప్రేమ ఉందనేది అర్థమవుతోంది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











