మరోసారి ఇలియానా అందాల ఆరబోత: ఆ భాగాలను హైలైట్ చేస్తూ సెల్ఫీ

ఇలియానా.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ అందానికి అందం.. నటనకు నటన.. అన్నింటికీ మించి వరుస ఆఫర్లతో చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించింది. తద్వారా ఎన్నో ఏళ్ల పాటు స్టార్‌గా వెలుగొందింది. దీంతో ఎన్నో కోట్ల మంది అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఇలియానా ఏ భాషలోనూ పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయితేనేం.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ కాలం వెల్లదీస్తోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇలియానా ఓ హాట్ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి!

చిన్న వయసులోనే స్టార్‌గా

చిన్న వయసులోనే స్టార్‌గా

టీనేజ్‌లోనే ఇలియానా 'దేవదాసు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఫలితంగా స్టార్‌గా మారి సుదీర్ఘ కాలం పాటు హవా చూపించింది.

టాలీవుడ్‌కు దూరమైందిగా

టాలీవుడ్‌కు దూరమైందిగా

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల పాటు సందడి చేసిన ఇలియానాకు ఓ దశలో వరుసగా ఫ్లాపులు వచ్చాయి. దీంతో ఆమె టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి ఎంటరైంది. అయితే, అక్కడ ఆమెకు మంచి పేరు వచ్చింది. అనంతరం మరోసారి ఇలియానా 'అమర్ అక్బర్ ఆంటోనీ'తో రీఎంట్రీ ఇచ్చింది. ఇది ఫ్లాప్ అవడంతో ఆమె టాలీవుడ్‌కు మళ్లీ దూరమైంది.

లవ్ బ్రేకప్.. మళ్లీ ప్రేమలో

లవ్ బ్రేకప్.. మళ్లీ ప్రేమలో

వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. ఇక, ఇప్పుడు ఇలియానా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడితో ప్రేమాయణం సాగిస్తోందని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి కనిపించడమే.

రీఎంట్రీలో ఆమెకు నిరాశే

రీఎంట్రీలో ఆమెకు నిరాశే

వాస్తవానికి బ్రేకప్ తర్వాత ఇలియానా డిప్రెషన్‌కు వెళ్లడంతో తన రూపాన్ని కోల్పోయింది. దీంతో మళ్లీ పర్‌ఫెక్ట్ ఫిగర్ కోసం చాలా శ్రమించింది. ఇలా తన ఫిజిక్‌ను తిరిగి తెచ్చుకున్న ఆమె.. ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే, తెలుగులోనూ ఆఫర్లు అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, ఆమెకు నిరాశే ఎదురు అవుతోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

చాలా ఏళ్ల పాటు వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై సందడి చేయకున్నా ఇలియానా మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా తెగ హైలైట్ అవుతోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ

సోషల్ మీడియాలో ఇలియానా చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఆమె అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. అలాగే, తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. ఫలితంగా వార్తల్లోనూ నిలుస్తోంది.

బికినీలో ఇలియానా హాట్ షో

బికినీలో ఇలియానా హాట్ షో

ఇలియానా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో బికినీ మాత్రమే ధరించి కనిపించింది. అది కూడా టాప్ యాంగిల్ నుంచి తీసుకుంది కావడంతో ఆమె పైనుంచి కింద వరకూ అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్‌ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X