మొదటిసారి బేబీ బంప్ వీడియో షేర్ చేసిన ఇలియానా.. ఒకప్పటి సన్నని నడుము.. ఇప్పుడు ఇలా..
తాను తల్లి కాబోతున్నానంటూ కొన్ని రోజుల క్రితం అందాల నిది ఇలియానా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు పెళ్లి కాకముందే ఓ బిడ్డకు తల్లి కానుందా అన్ని అప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఇలియానా మనసు దోచుకున్న ఆ చెలికాడు ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు గోవా బ్యూటీని కాంగ్రాట్స్ చెబుతూనే ప్రశ్నించారు. ఇక రీసెంట్ గా ఇలియానా తన బేబీ బంప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చివరగా ఆ సినిమాలో..:దేవదాసు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఇలియానా.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఆ తర్వాత పోకిరితో ఇండస్ట్రీ హిట్ చూసి ఆ తరువాత కూడా సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో మెరిసింది. ఈ ముద్దుగుమ్మ చివరగా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో కనిపించింది. ఇక ఆ తర్వాత నుంచి సినీ రంగంలో కనిపించకుండా పోయిందీ క్యూట్ బ్యూటీ.

సక్సెక్ రాకపోయినా కూడా..:టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో తన మకాం ను బాలీవుడ్ కు మార్చేసింది. టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ లో ఊహించినంత సక్సెక్ రాకపోయినా కొంత కాలంపాటు ఎలాగోలా నెట్టుకొచ్చింది. పలు సినిమాల్లో నటించి తన అందాలు ఆరబోసినా బాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అలా క్రమంగా సినిమా అవకాశాలు తగ్గినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది ఈ గోవా బ్యూటీ.

బేబీ బంప్ వీడియో:తాజాగా ఇలియానా మరో ఇంట్రెస్టింగ్ పోస్టు చేసింది. మొన్న తల్లి కాబోతున్నట్లు చెప్పిన ఈ భామ ఇప్పుడు ఏకంగా తన బేబీ బంప్ ను వీడియో తీసి పోస్టు చేసింది. ఇందులో బెడ్ పై కాళ్లు చాపి కూర్చుని ఉంది. ఎడ చేతిలో కాఫీ కప్ పట్టుకుని తన బేబీ బంప్ ను సగం వరకు చూపించేసింది. 'లైఫ్ లేట్లీ' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఇలియానా.

అతనితోనే డేటింగ్?:కత్రినా కైఫ్ సోదరుడు, 45 ఏళ్ల సెబాస్టియన్‌తో ఇలియానా డేటింగ్ చేస్తుందని గతంలో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. కత్రినా, విక్కీ కౌశల్ మాల్దీవ్స్ వెళ్లినప్పుడు ఇలియానా సెబాస్టియన్ కూడా వెళ్లారు. అక్కడ వారు దిగిన ఫొటోలు గతంలో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మరి సెబాస్టియన్ యే ఇలియానా బిడ్డకు తండ్రా.. లేక సింగిల్ పేరెంట్ గానే ఇలియానా బిడ్డను కనాలనుకుందో మాత్రం ఈ గోవా బ్యూటీ వెల్లడించలేద.

సినిమాలకు ముగింపు?:ఇలియానా ఇటీవల కాలంలో తన ప్రేయసి కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది గతంలో ఈ బ్యూటీ ఏదో ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ కనిపించేది కానీ ఈసారి మాత్రం ఆమె ఎక్కడా కూడా మీడియాకు ఇంటర్వ్యూలో ఇవ్వడం లేదు అలాగే సోషల్ మీడియాలో కూడా తన లైఫ్ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం లేదు ఇక తల్లి అయిన తర్వాత ఆమె సినిమాలకు దాదాపు దూరం కావచ్చు అని గాసిప్స్ కూడా గుర్తుకొస్తున్నాయి కానీ ఇంతవరకు ఆ విషయంలో కూడా ఇలియానా క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











