Don't Miss!
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఏమీ లేకుండా కనిపించిన ఇలియానా: ఆమెనిలా చూసి నెటిజన్లంతా షాక్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో గోవా చిన్నది ఇలియానా ఒకరు. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది.
అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇలా చాలా ఏళ్ల పాటు హవాను చూపించిన ఈ అమ్మడు.. కొంత కాలంగా పెద్దగా సినిమాలు చేయట్లేదు. అయితేనేం.. సోషల్ మీడియా ద్వారా అందరినీ అలరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇలియానా ఏమీ లేకుండా దిగిన వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా వచ్చి ఫేమస్ అయింది
చాలా చిన్న వయసులోనే 'దేవదాసు' అనే సినిమాతో ఇలియానా హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అద్భుతమైన నటనతో పాటు అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ బాగా హైలైట్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్లతో నటించింది. దీంతో నేమ్, ఫేమ్ భారీగా వచ్చాయి. అలా చాలా కాలం ఆమె హవాను చూపించింది.
యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్

తెలుగు సినిమాలకు దూరం
చాలా కాలం పాటు వరుస సినిమాలతో హవాను చూపించిన ఇలియానాకు చాలా పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఆమె టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అక్కడ ఆమెకు మంచి పేరు వచ్చింది. అనంతరం మరోసారి ఇలియానా 'అమర్ అక్బర్ ఆంటోనీ'తో రీఎంట్రీ ఇచ్చింది. ఇది ఫ్లాప్ అవడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమైంది.

లవ్ ఫెయిల్... డిప్రెషన్‌లోకి
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఇలియానా.. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు అతడితో కలిసి ఎంజాయ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఈ అమ్మడు గర్భవతి అయిందని, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఆత్మహత్యయత్నం చేసిందని కూడా జోరుగా ప్రచారం జరిగింది.
డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

రీఎంట్రీ ప్రయత్నాలు చేసినా
ప్రియుడితో విడిపోయిన తర్వాత ఇలియానా బాగా లావైపోయింది. ఇక, కొంత కాలంగా ఆమె కెరీర్ మీద ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే తన ఫిజిక్‌ను తిరిగి తెచ్చుకున్న ఆమె.. ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే, తెలుగులోనూ ఆఫర్లు అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, ఆమెకు ఇది తీరని కోరికగానే మిగిలిపోతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
అప్పట్లో మాదిరిగా కొంత కాలంగా సినిమాల్లో నటించకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఇలియానా తన అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫలితంగా తన ఫాలోవర్లను పెంచుకుంటూ ముందుకెళ్తోంది.
శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ
ఇలియానా సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో ఆమె అందాల విందు చేస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో తన బాడీ పార్టులను చూపిస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. అలాగే, తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

మేకప్ లేకుండా కనిపించింది
తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె అస్సలు మేకప్ లేకుండానే కనిపించింది. ఆ తర్వాత చిటికెలో ఫుల్ మేకప్‌తో కనిపించింది. ఇదిలా ఉండగా.. ఇలియానా మేకప్‌లెస్ ఫేస్ చూసిన వాళ్లంతా షాక్‌కు గురవుతున్నారు. ఫలితంగా ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. ఇది వైరల్‌గా మారిపోయింది.