అందరూ ఆ పార్టునే చూపిస్తారు.. అలాంటి వీడియోలు చూసి షాకయ్యా: బయటపెట్టిన ఇలియానా

ఇప్పుడు ఉన్న పోటీలో సినిమా రంగంలో స్టార్లుగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. కానీ, కొందరు భామలు మాత్రం తమదైన టాలెంట్లతో సత్తా చాటుతూ బడా హీరోయిన్లుగా దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. చాలా ఏళ్ల పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఈ చిన్నది.. కొంత కాలంగా బాలీవుడ్‌లో సందడి చేస్తోంది. ఇక, ఇప్పుడు తల్లైన తర్వాత కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇలియానా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే!

చిన్న వయసులో స్టార్‌గా
టీనేజ్‌లో ఉన్నప్పుడే ఇలియానా 'దేవదాసు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఫస్ట్ మూవీలోనే యాక్టింగ్, గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది.. అందరి దృష్టినీ లాక్కుంది. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఇలా ఇలియానా టాలీవుడ్‌లోని స్టార్లు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా ఎన్నో హిట్ల కొట్టేసి స్టార్‌‌గా ఎదిగిపోయింది.

Actress Ileana D Cruz Reveals Her Major Problem With Directors

అప్పటి నుంచి డౌన్‌గా

తెలుగులో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా ప్రభావాన్ని చూపించిన ఇలియానా.. కొంత కాలం పాటు హిట్లు రాకపోవడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆరంభంలో చక్కగానే రాణించింది. ఆ సమయంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో లవ్ ట్రాక్ నడిపింది. కొన్నేళ్లకు అతడికి బ్రేకప్ చెప్పేసి డిప్రెషన్‌లోకి వెళ్లిడంతో కెరీర్‌ డౌన్ అయిపోయింది.

అక్కడ మాత్రం ఫుల్లు
బ్రేకప్ తర్వాత చాలా కాలం పాటు కెరీర్ పరంగా, పర్సనల్ పరంగా ఇబ్బందులు పడ్డ ఇలియానా.. ఇప్పుడిప్పుడే కెరీర్‌ను మళ్లీ చక్కదిద్దుకుంటోంది. ఇందులో భాగంగానే కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తోంది. ఇలా Sab Gazab అనే మ్యూజిక్ వీడియో చేసింది. అలాగే, Unfair & Lovely అనే మూవీనీ చేసింది. తర్వాత బాలీవుడ్‌లో హవా చూపిస్తోంది.

Actress Ileana D Cruz Reveals Her Major Problem With Directors

తల్లైన తర్వాత కూడా

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఇలియానా పర్సనల్ విషయాలపైనా ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తుందని ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇలియానా ఇటీవలే ప్రియుడితో కలిసి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలు చేస్తోంది. ఇలా ఇటీవలే దో ఔర్ దో ప్యార్ మూవీతో అలరించింది.

ఆ పార్టునే చూపారని
ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఇలియానా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా 'చాలా మంది డైరెక్టర్లు ఎందుకనో ప్రధానంగా నా నడుమునే హైలైట్ చేసి చూపించారు' అంటూ చెప్పుకొచ్చింది.

Actress Ileana D Cruz Reveals Her Major Problem With Directors

వార్నింగ్ ఇచ్చానని

ఆ తర్వాత ఇలియానా కంటిన్యూ చేస్తూ.. 'నా బాడీలో మరో పార్ట్ లేనట్లుగా దర్శకులు అందరూ నడుము మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు. అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. కొంత మంది డైరెక్టర్లకు ఇలా చేయొద్దని సూటిగానే వార్నింగ్ ఇచ్చాను. అప్పటి నుంచి ఆ కోణాన్ని మార్చుకున్నారు. లేకుంటే ఇదే కంటిన్యూ చేసేవారు' అంటూ వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X