2వ సారి ఇలియానా ప్రెగ్నెన్సీ?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఊపూపింది గోవా బ్యూటీ ఇలియానా. మహారాష్ట్రలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా గోవాలోనే పెరిగింది. తనకు పదేళ్ల వరకు గోవాలోనే ఉన్నారు. ఆ తర్వాత పోర్చుగీసుకు వలస వెళ్లారు. దాంతో ఇలియానా కూడా 2014కు ముందుకు ఇండియన్ నేషనాలిటీని కలిగి ఉండి.. ఆ తర్వాత పోర్చుగీస్ పౌరురాలిగా మారింది. ఏదేమైనా ఇలియానా టాలీవుడ్ లో అప్పట్లో సెన్సేషన్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. తన అందం, నటన, హావభావాలతో ఆడియెన్స్ ను ఇట్టే కట్టిపడేసిందీ ముద్దుగుమ్మ.
'దేవదాసు'తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయిన ఇలియానా తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'పోకిరి'లో నటించి మెప్పించింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. ఇండస్ట్రీలో మొదటి రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రంగానూ రికార్డు క్రియేట్ చేసింది. 2006లో వచ్చినా.. ఇప్పటికీ పోకిరీకి ఆడియెన్స్ లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రీరిలీజ్ కూడా గ్రాండ్ గానే జరిగింది. అలాగే రాఖీ, మున్నా, ఆట, పవన్ కళ్యాణ్ తో 'జల్సా', కిక్, శక్తి, జులాయి.. వంటి చిత్రాలతో వరుసగా అలరించింది. మంచి హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

ఇదిలా ఉంటే... అభిమానులు ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇలియానా మాత్రం షాకింగ్ గా సర్ ప్రైజ్ లు ఇస్తుంటుంది. పెళ్లి కాకుండా తన ప్రియుడితో ఈ ముద్దుగుమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయకున్నా.. మైఖేల్ డోనాల్డ్ అనే వ్యక్తిని ఇలియానా 2023లోనే పెళ్లి చేసుకుందని చెబుతున్నారు. ఏదేమైనా ఇలియానా సంతోషంగా ఉండటం అభిమానులకు ఖుషినిస్తుంది. కాగా.. తాజాగా ఇలియానా గురించి మరోన్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. తను రెండో సారి గర్భవతి అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆమె అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లలో మాత్రం ఎలాంటి అప్డేట్స్ లేవు.
ఇలియానా రీసెంట్ గా తన ఇన్ స్టా స్టోరీ ద్వారా ప్రెగ్నెన్సీ పై స్పందించినట్టు తెలుస్తోంది. ఆమె తన రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇలియానా డైరెక్ట్ గా అనౌన్స్ చేయకపోయినా.. ఆమె కొద్దిరోజులుగా పెడుతున్న పోస్టులు అలాంటి సూచనలనే తెలియజేస్తున్నాయని అంటున్నారు. ఇదే నిజమైతే ఇలియానా త్వరలో తన రెండో బిడ్డకు జన్మనివ్వనుందని అభిమానులు సంతోషిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆమె పోస్ట్ లను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇలియానా రెండో ప్రెగ్నెన్సీ వార్తలు మాత్రం ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో గుప్పుమంటున్నాయి.

ఇలియానా చివరిగా శిర్షా గుహా ఠాకుర్తా దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'దో ఔర్ దో ప్యార్'లో నటించింది. ఈ చిత్రంలో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామమూర్తిలు కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. వరల్డ్ వైడ్ గా రూ. 5.5 కోట్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ గా నిలిచింది. ఇక తెలుగులో చివరిగా ఇలియానా రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ'తో అలరించింది.


Click it and Unblock the Notifications











