జీవితంలో కష్టాలు.. ఫస్ట్ టైమ్ భర్త ఫొటోతో ఇలియానా షాకింగ్ పోస్ట్!

ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపూపించింది హీరోయిన్ ఇలియానా డిక్రూజ్. సన్నని నడుముతో తెలుగు ఆడియెన్స్ గుండెల్ని కొల్లగొట్టింది. తన అద్బుతమైన నటనతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తొలుత ఎనర్జీటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేనితో కలిసి 'దేవదాసు'లో నటించింది. వైవీఎస్ చౌదరి గోవా అందాన్ని తెలుగు ఆడియెన్స్ కు పరిచయం చేశారు. తొలి చిత్రంతోనే ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ మంచి క్రేజ్ దక్కింది.

ఆ తర్వాత రెండో చిత్రం 'పోకిరీ'తో ఇలియానా రేంజ్ ఆకాశానికెళ్లింది. నెక్ట్స్ భారీ మూవీస్ తో ఫుల్ బిజీ అయ్యి పోయింది. ఓ పదేళ్ల పాటు ఇండస్ట్రీలో తన సత్తా చాటింది. మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజ సరసన నటించి మెప్పించింది. ఇలియానా కెరీర్ లో 'దేవదాస్', 'పోకిరి'తో పాటు 'మున్నా', 'జల్సా', 'కిక్క్', 'జులాయి' వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించి పెట్టాయి. మిగితా చిత్రాల్లోనూ ఆమె పెర్ఫామెన్స్ ఇరగదీసింది.

Actress Ileana Shocking Post with sharing her Husband Photo Here is full Details

ఇదిలా ఉంటే.. ఓ పదేళ్లు సౌత్ సినిమాలకు ఈ ముద్దుగుమ్మ దూరమైన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఆఫర్లు అందుకోలేకపోయింది. 'అమర్ అక్బర్ ఆంటోనీ'తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తూ కెరీర్ ను అలా సాఫీగా సాగిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది. తాజాగా భర్త ఫొటోను షేర్ చేస్తూ ఓ షాకింగ్ పోస్ట్ ను పెట్టింది.

మొదటి పోస్టులో... కష్టాలు పడుతున్న రోజుల్లో ఎవరైతే ఓపిగ్గా మన జీవితంలో ఉంటారో అది వారి ప్రేమకు మరో రూపం.. అని మెసేజ్ ఇచ్చేలా పోస్టు పెట్టింది. ఆ వెంటనే 'కుటుంబం ఎలా ఉంటుంది' అనే క్యాప్షన్ ఇస్తూ తన భర్తను హగ్ చేసుకున్న ఫొటోను షేర్ చేసుకుంది. అయితే ప్రస్తుతం ఇలియానా తన ఫ్యామిలీతో హాయిగానే సమయం గడుపుతోంది. సంతోషంగా జీవిస్తోంది. కెరీర్ లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది.

Actress Ileana Shocking Post with sharing her Husband Photo Here is full Details

అయితే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ క్రేజీ కంటెంట్ తో ఎనర్జీ నింపే ఇలియా ఈసారి మాత్రం కాస్తా ఎమోషనల్ సైడ్ ను చూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భావోద్వేగంతో పెట్టిన పోస్టుల్లాగా కనిపిస్తున్నాయని, ఇలియానా జీవితంలో కష్టాలు అంటూ ఇలా పోస్టు పెట్టడం పట్ల సందేహాలు మొదలయ్యాయి. మరికొందరు మాత్రం అదేం లేదని... రీసెంట్ గానే 'గోవా'కు ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ట్రిప్ కు వెళ్లొంచిందని, హాయిగా జీవితాన్ని నడిపిస్తోందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇలియానా తన భర్త ఒడిలో ఉన్న ఫొటో మాత్రం అందనీ ఆకట్టుకుంటోంది. తన భర్త ఒడినే ఇల్లులా భావిస్తున్నట్టు ఇలా పిక్చర్ తో తెలియజేసింది. ఇక ఇలియానా చివరిగా 'దో ఔర్ దో ప్యార్' చిత్రంతో అలరించింది.

More from Filmibeat

Read more about: ileana struggles goa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X