10 ఏళ్ల తర్వాత తెరపైకి యంగ్ బ్యూటీ.. ఏకంగా మెగాస్టార్ తో బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా!
నార్త్ కు చెందిన నటి ఇషా చావ్లా 'ప్రేమ కావాలి' చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించింది. 2011లో వచ్చిన ఈ సినిమాలో ఆది సాయికుమర్ హీరోగా నటించారు. వీరిద్దరికి ఇది తొలిచిత్రం కావడం విశేషం. మొదటి చిత్రంతోనే అటు ఆది సాయికుమార్, ఇటు ఇషా చావ్లా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. 14ఏళ్ల కింద రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ యువతను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్ అందించిన పాటలు అదరగొట్టాయి. ఇప్పటికీ సంగీత ప్రియులను 'ప్రేమ కావాలి' చిత్రం సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇషా చావ్లా కొన్నాళ్ల పాటు మాత్రమే టాలీవుడ్ లో సినిమాలు చేసింది. తనకు నటించిన కొన్ని చిత్రాలతోనైనా తెలుగు ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైందీ ముద్దుగుమ్మ. 'ప్రేమ కావాలి' హిట్ అందుకున్న తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. 'పూల రంగడు', 'శ్రీమన్నారాయణ', 'మిస్టర్ పెళ్లికొడుకు', 'జంప్ జిలానీ' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిగా కన్నడ స్టార్ దర్శన్ సరసన 'విరాట్' చిత్రంతో ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత నుంచి ఏమైందో గానీ పెద్దగా సినిమాలు చేయలేదు. ఎంఎస్ దర్శకత్వంలోని 'రంభా ఊర్వశీ మేనక' చిత్రంలో చివరిగా నటించినా.. ఆ మూవీ షెడ్ కు వెళ్లిపోయింది.

ఆ తర్వాత నుంచి ఇషా చావ్లా నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ రాలేదు. హీరోయిన్ గా మంచి ఆఫర్ల అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఎందుకనో సినిమాలకు దూరంగా ఉండిది. దాదాపుగా 10 ఏళ్ల పాటు సినీ రంగానికే దూరమైంది. ఇక ఈ బ్యూటీని వెండితెరపై చూస్తామో లేదో అన్న సందేహం కూడా కలిగింది. కానీ పదేళ్లకు మళ్లీ వెండితెరపై మెరిసేందుకు ఇషా చావ్లా సిద్ధమైంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్ర హీరో, పద్మవిభూషణ్ చిరంజీవి సినిమాలో అవకాశం దక్కింది. మెగాస్టార్ రాబోయే చిత్రం 'విశ్వంభర'తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వనుండటం ఆసక్తికరంగా మారింది.
ఏడాదిన్నరగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వంభర' చిత్రం ఇక ఎట్టకేళలకు ప్రస్తుతం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకొని అప్డేట్ ఇవ్వబోతోంది. ఈ క్రమంలో 'విశ్వంభర'లో ఇషా చావ్లా ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేని ఆసక్తికరంగా మారింది. సోషియో ఫాంటసీగా విత్ యాక్షన్ జొనర్ లో రూపుదిద్దుకుంటున్న 'విశ్వంభర'లో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్, బ్యూటీఫుల్ హీరోయిన్ ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలతో ఆకట్టుకోబుతున్నారు.
ఇక ఇషా చావ్లా ఢిల్లీలో పుట్టి పెరిగింది. మార్చి 6న ఈ ముద్దుగుమ్మ బర్త్ డే కావడం విశేషం. రీసెంట్ గానే తన 37వ పుట్టిన రోజును జరుపుకుంది. పొలిటికల్ సైన్స్ కోర్సులో గ్యాడ్యూయేట్ అయ్యి పట్టా పొందింది. ఆ తర్వాత ముంబైకి చెందిన ఓ థియేటర్ గ్రూప్ లో చేరి యాక్టింగ్ పాఠాలు నేర్చుకుంది. ఇక ఇన్నాళ్లకు మళ్లీ 'విశ్వంభర'తో అలరించడానికి సిద్ధమైంది. మెగాస్టార్ ఇచ్చే ఎనర్జీతో మళ్లీ వరుస ఆఫర్లు అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











