Divorce భర్తతో విడాకులు తీసుకొన్న స్టార్ హీరోయిన్ కుమార్తే.. 11 ఏళ్ల వైవాహిక జీవితానికి నటి గుడ్‌బై
సినీ పరిశ్రమలో మరో జంట 11 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. ప్రముఖ నటి, ఎంపీ హేమమాలిని, ధర్మేంద్ర ముద్దుల కూతురు ఇషా డియోల్ తన భర్త నుంచి విడిపోయారు. ఈ వార్త బాలీవుడ్ సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే వారిద్దరి విడిపోతున్నారంటూ వచ్చిన వార్తలకు బలం చేకూరేలా ఇషా డియోల్ దంపతులు స్వయంగా తాము విడిపోతున్నట్టు ప్రకటించడంతో రూమర్లకు తెరదింపినట్టు అయింది. ఇషా డియోల్ దాంపత్య జీవితం, విడాకుల వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటులు ధర్మేంద్ర, హేమామాలిని కూతురుగా ఇషా డియోల్ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది. అయితే సినిమా పరిశ్రమలో అంతంత మాత్రంగానే ఆమెకు పాపులారిటీ దక్కింది. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త భరత్ తక్తానీతో జూన్ 2012 సంవత్సరంలో వివాహం జరిగింది.

కొద్దికాలంగా ఇషా డియోల్, భరత్ విడిపోతున్నారనే వార్త మీడియాలో గుప్పుమన్నది. ఈషా, హేమా మాలిని బర్త్ డే ఫంక్షన్‌లో ఆయన కనిపించకపోవడంతో ఈ రూమర్‌కు మరింత బలం చేకూరింది. గత ఏడాదిగా వారిద్దరూ సపరేట్‌గా ఉంటున్నారు. తాజాగా విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఇషా డియోల్ దాంపత్య జీవితం 11 ఏళ్ల పాటు ఆనందం, విభేదాలతో సాగింది. వారికి రాధ్యా, మిరయా ఇద్దరు సంతానాన్ని కలిగి ఉన్నారు. రాధ్యా వయసు 6 సంవత్సరాలు, మిరయా వయసు 4 ఏళ్లు అని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇషా, భరత్ ఇష్టపూర్వకంగానే విడిపోతున్నట్టు వారు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఇషా, భరత్ తక్తానీ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. మా దాంపత్య జీవితంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకొలేని పరిస్థితుల్లో మేమిద్దరం విడిపోవాలని పరస్పర అవగాహనకు వచ్చాం. సానుకూల దృక్పథంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నాం అని తెలిపారు.
మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి మంచి చెడులను దృష్టిలో పెట్టుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాం. వారిద్దరి భవిష్యత్ మాకు చాలా ముఖ్యం. ఈ నిర్ణయం మేమిద్దరం కలిసి తీసుకొన్న నిర్ణయం. మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని వారిద్దరూ వేడుకొన్నారు.

ఇషా డియోల్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నా తుమ్ జానే..నా హమ్, యువ, ధూమ్, కాల్, చురాలియా హై తుమ్నే, నో ఎంట్రీ చిత్రాల్లో నటించింది. తన రెండో కూతురు పుట్టిన తర్వాత ఆమె క్రేజీ అండ్ ఇరిటేటెడ్ అనే పుస్తకాన్ని రచించారు. విడాకుల తర్వాత మళ్లీ ఆమె సినీ రంగానికి వస్తారా? లేరా అనే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











