అయ్యో.. వర్మకు గడ్డుకాలం.. కష్టాలు తీరాలి.. హాట్ హీరోయిన్ ఆవేదన

తెలుగు తెరకు చాలా కాలంగా దూరమైన సినీ తార ఇషా కోప్పికర్ మళ్లీ ప్రేక్షకులు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే వెండితెరకు కాకుండా చిట్టితెరలో ప్రభావం చూపేందుకు ప్లాన్ వేసింది. ఆ క్రమంలోనే చాలా ఏళ్ల తర్వాత దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేతులు కలిపింది. ఆర్జీవి రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న ఆమె ఆయన కెరీర్‌పై ఆందోళనను, సానుభూతిని వ్యక్తం చేసింది. వర్మపై ఇషా చేసిన కామెంట్లు ఏమిటంటే..

వెబ్ సిరీస్‌లో

వెబ్ సిరీస్‌లో

రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌కు సంబంధించిన మేజర్ పార్ట్ పూర్తి చేశాను. ప్రజెంటర్‌గా, దర్శకుడిగా ఆర్జీవి కీలకపాత్రను పోషించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు మొత్తం నలుగురు దర్శకులు పనిచేశారు. షూట్ పూర్తి చేసిన తర్వాత అన్ని ఎపిసోడ్స్‌ను వర్మకు అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను ఆయన చేపట్టారు అని ఇషా కొప్పికర్ అన్నారు.

ఈసారి మ్యాజిక్ గ్యారెంటీ

ఈసారి మ్యాజిక్ గ్యారెంటీ

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో వర్మ బిజీగా ఉన్నారు. ఈసారి వెబ్ సిరీస్‌తో మ్యాజిక్ చేయడం గ్యారెంటీ. ఆర్జీవి జీనియస్. భారతీయ సినిమాకు గొప్ప సినిమాలు అందించారు. హిందీలో ఫస్ట్ హారర్ ఫిలిం రాత్రి అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత వచ్చిన బూత్ లాంటి సినిమాలు కూడా బాగా నచ్చాయి అని ఇషా కొప్పికర్ తెలిపారు.

వర్మ ఎలాంటి సినిమాలైనా తీయగలడు

వర్మ ఎలాంటి సినిమాలైనా తీయగలడు

రాంగోపాల్ వర్మ ఎలాంటి సినిమాలైనా తీయగలడు. హారర్, రొమాంటిక్, మ్యూజికల్, గ్యాంగస్టర్, యాక్షన్.. ఇలా అన్ని రకాల జోనర్లతో సినిమాలు తీసే సత్తా వర్మకు ఉంది. రంగీలా, సత్య, సర్కార్ చిత్రాలు సినీ పరిశ్రమలో సంచలనం రేపాయి. కల్ట్ ఫిలింస్ తీయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఇషా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వర్మ జీవితంలో గడ్డుకాలం

వర్మ జీవితంలో గడ్డుకాలం

ప్రతీ ఒక్కరి జీవితంలో మాదిరిగానే రాంగోపాల్ వర్మ గడ్డుకాలాన్ని, ఎన్నడూ లేని విధంగా కష్టకాలన్ని ఎదుర్కొంటున్నాడు. ఆయన కెరీర్‌లో సరైన హిట్లు లేకపోవడం బాధగా ఉంది. ఈ ఇండస్ట్రీలో జాతకాలు మార్చేది ప్రతీ శుక్రవారమే. ఏదో ఒక శుక్రవారం మళ్లీ ఆయన విజృంభించడం ఖాయం అని ఇషా తెలిపారు.

మళ్లీ సత్తా చాటడం ఖాయం

మళ్లీ సత్తా చాటడం ఖాయం

విభిన్నమైన కాన్సెప్ట్‌తో వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌తో వర్మ మళ్లీ సత్తా చాటుతాడు. తిరిగి పూర్వవైభవాన్ని అందుకొంటాడనే ఆశతో ఉన్నాను. ఇక నుంచి వర్మకు అన్నీ మంచి రోజులే రావాలని కోరుకొంటున్నాను అని ఇషా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Recommended Video

Rishabh Pant Blocks Urvashi Rautela On Whatsapp ||
కంపెనీలో ఖల్లాస్ అంటూ

కంపెనీలో ఖల్లాస్ అంటూ

వర్మ రూపొందించిన కంపెనీ చిత్రంలో ఖల్లాస్ అనే పాటలో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను కూడగట్టుకొన్న ఇషా కోప్పికర్.. ఆయన ప్రొడక్షన్‌లో రూపొందించిన డార్లింగ్, షబ్రీ అనే సినిమాలో నటించారు. అలాగే ప్రస్తుతం తమిళంలో ఆయాలాన్ అనే సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X