‘ముగ్గురు పిల్లలను కనాలని ఉంది.. ఎందుకంటే?’ జాన్వీ కపూర్ కామెంట్స్
బ్యూటీఫుల్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం స్టార్ హీరోలకు జోడీగా నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రోటీన్ కు భిన్నమైన పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా పరమ్ సుందరి అనే బాలీవుడ్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 29నే ఈ చిత్రం హిందీతో పాటు ఇతర భాషల్లోనూ గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ చిత్రం పరమ్ సుందరి ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ చేసిన రీసెంట్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లి అయిన తర్వాత తన కిడ్స్ ప్లానింగ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే గతంలోనే జాన్వీ కపూర్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు భవిష్యత్ లో పుట్టబోయే పిల్లల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ఇక తాజాగా పరమ్ సుందరి చిత్రం ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ ఆ కామెంట్స్ కు వివరణ ఇచ్చింది. అయితే గతంలో తాను ముగ్గురు పిల్లలను కనాలనుకుంటున్నట్లు హీరోయిన్ జాన్వీ కపూర్ ఓ సందర్భంలో తెలిపింది. దీనిపై తాజాగా పరమ్ సుందరి ప్రమోషన్లలో ఆమె స్పందించారు. 'నా లక్కీ నంబర్ 3. అందుకే పెళ్లి తర్వాత ముగ్గురికి జన్మనిస్తా. వారిలో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మూడో బిడ్డ ఎవరికి సపోర్ట్ చేస్తారో నేను చూడాలి. సందర్భాన్ని బట్టి వాళ్ల మద్దతు మారుతూ ఉంటుంది. ఇలా నా బిడ్డలందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు' అంటూ చెప్పారు.

ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్ ఇలా పిల్లల గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ పెళ్లిపైనా కూడా చర్చ కొనసాగుతోంది. కానీ ప్రస్తుతం జాన్వీ కపూర్ కెరీర్ పైనే ఫోకస్ పెట్టడంతో పెళ్లికి ఇంకాస్తా గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో జాన్వీ కపూర్ మరిన్ని చిత్రాల్లో నటించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఇక పరమ్ సుందరి చిత్రంలో మలయాళం, తమిళ అమ్మాయిగా కనిపించి అలరించింది.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూ దక్కడం విశేషం. తన పాత్ర ద్వారా జాన్వీ పూర్ ట్రోల్స్ కు గురైన తన పెర్ఫామెన్స్ ను ఆకట్టుకుందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో హీరోగా బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా నటించడం విశేషం. ఛావా సినిమాను రూపొందించిన మ్యాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మించడం విశేషం. దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించారు.
ఇక జాన్వీ కపూర్ తెలుగులో భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించింది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2026 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మరోవైపు దేవర 2లో జాన్వీనే అలరించబోతోంది. ఇక అల్లు అర్జున్ - అట్లీ చిత్రంలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











