‘ఏడాదిలోపే విడాకులు.. పెళ్లి తర్వాత ప్రతి రాత్రి చిత్రహింసలు‘

Jaya Lalitha: సినీ,టీవీ నటి జయలలిత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నెగిటివ్ పాత్రలు, గ్లామర్ రోల్స్, వాంప్ క్యారెక్టర్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు, తమిళ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. కమల్‌హాసన్ నటించిన ఇంద్రుడు చంద్రుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జయలలిత, ఆ తర్వాత జంబలకిడి పంబ, ఆ ఒక్కటి అడక్కు, మామ అల్లుడు, లారీ డ్రైవర్, జంబ లకిడి పంబ, హంగామా, భరత్ అనే నేను వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే.. మలయాళ దర్శకుడు వినోద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది జయలలిత. అయితే.. ఏడేండ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత తన కలల జీవితంగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల నటి జయలలిత పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంంది. అందులో ఆమె చెప్పిన బాధలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. జయలలిత మాట్లాడుతూ.. మలయాళ దర్శకుడు వినోద్‌తో షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడిందని, ఒక సందర్భంలో తనను కాపాడిన తర్వాత ఆ ప్రేమ మరింత పెరిగిందని తెలిపారు. ఏడేళ్లు ప్రేమలో ఉన్నతప్ప, పెళ్లిపై సందేహం ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటూ వినోద్ బెదిరించడంతో తన మనసు కరిగిపోయి పెళ్లికి అంగీకరించానని చెప్పారు. అయితే.. ఆమె కుటుంబం ఈ వివాహానికి వ్యతిరేకమయ్యిందని, చివరకు ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నానని తెలిపారు.

Actress Jaya Lalitha Opens Up About Painful Marriage and Abuse in Viral Interview

పెళ్లి అనంతరం భర్త వైఖరి పూర్తిగా మారిపోయిందని, తన కోసం కాకుండా తన ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నారని అప్పుడు అర్థమైందని ఆవేదన వ్యక్తం చేసింది. 'పెళ్లి అయిన వారం రోజుల్లోనే కట్నం, ఆస్తి బంధాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు" అన్నారు. పెళ్లి తర్వాత చాలా త్వరలోనే వేధింపులు ప్రారంభమయ్యాయని, "నీ మీద అసిడ్ పోస్తా.. చంపేస్తా" అంటూ బెదిరించేవాడని జయలలిత పేర్కొన్నారు.

నెలలు గడిచే కొద్దీ.. భర్త హింస మరింత పెరిగిందని, చివరకు గదిలో బంధించాడని తెలిపారుజ అప్పుడు సీనియర్ నటుడు చలపతి రావు, నిర్మాత జయకృష్ణ, గోపాలకృష్ణ తనకు అండగా నిలిచారనీ, వారి సహాయంతో తాను ఆ రోజు తన ఇల్లు నుంచి బయటపడగలిగానని చెప్పారు. 'వాళ్లు సహాయం చేయకపోతే.. ఈ రోజు నేను బతికి ఉండేదాన్నో లేదో కూడా తెలియదు"అంటూ ఎమోషనల్ అయ్యారు.

వివాహం ఏడాది కూడా పూర్తికాకముందే విడాకులు తీసుకున్నానని, ఆ సంబంధం తన జీవితంలో అత్యంత బాధాకరం అని తెలిపారు. కెరీర్‌లో గ్లామర్, వాంప్, కామెడీ రోల్స్ చేస్తూ కెరీర్ లో సక్సెస్ అందుకున్న జయలలిత, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తనకు ఏ రోజు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాలేదనీ, జీవితం ఏదైనా ఎదుర్కోవాలి. పారిపోవడం కాదు" అంటూ ధైర్యంగా మాట్లాడారు. ప్రస్తుతం జయలలిత పాత ఇంటర్య్వూ తిరిగి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె అనుభవాలు, ధైర్యంపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X