‘ఆ హీరోతో పిల్లలను కనాలనుకున్నా.. వాళ్ల వల్లే మా పెళ్లి కాలేదు'

ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఓ నటి... జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, ప్రేమ వివాహం, మోసం, విడాకులు, ఒంటరితనం ఎదుర్కొంది. అయినా మరోసారి కూడా ప్రేమను మళ్లీ నమ్మింది. ఈక్రమంలో ఓ స్టార్ హీరోతో అత్యంత ఆత్మీయ బంధం ఏర్పడింది. అతనితో కలిసి జీవించాలని భావించింది. పిల్లలను కనాలనే వరకు ఆలోచించింది. కానీ పరిస్థితులు, నిర్ణయాలు ఆ కలను నిజం కాకుండా చేశాయి. ఇన్నేళ్ల తర్వాత ఆమె బయటపెట్టిన ఈ నిజాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు ఆ నటి ఎవరు? ఆ హీరో ఎవరు? వారి మధ్య జరిగిన అసలు కథ ఏమిటి?

Also Read
రోజుకి లక్షల్లో పారితోషికం.. నోట్ల కట్టలపై నిద్ర.. చివరికి దిక్కులేని అనాధలా..
రోజుకి లక్షల్లో పారితోషికం.. నోట్ల కట్టలపై నిద్ర.. చివరికి దిక్కులేని అనాధలా..

ఆ నటి ఎవరో కాదు.. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జయలలిత (Jayalalitha). సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రారంభ దశలో జయలలిత ఎక్కువగా ఐటమ్ సాంగ్స్, గ్లామర్ పాత్రలు పోషించింది. ఆ సమయంలో ఆమెకు మంచి క్రేజ్, ఆదాయం వచ్చాయి. కానీ అదే గ్లామర్ ఇమేజ్ ఆమెకు మైనస్‌గా మారిందట. ఇతర సీనియర్ హీరోయిన్లు అమ్మ, అత్త పాత్రలు చేస్తుంటే, తనకు మాత్రం అలాంటి మంచి అవకాశాలు అందుకోలేకపోయిందట.

Actress Jayalalitha Reveals Love Story with Sarath Babu and Dream of Having a Child Together

ఇటీవల నటి జయలలిత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, బాధలు, ఆత్మీయ బంధాల గురించి ఎంతో భావోద్వేగంగా పంచుకుంది. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమెకు పెద్ద దెబ్బ తగిలింది. ఒక దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అతడి ప్రవర్తనను భరించలేక కేవలం మూడు నెలల్లోనే విడిపోయింది.ఆ తర్వాత మళ్లీ పెళ్లి గురించి ఆలోచించలేదని స్పష్టం చేసింది.'ఒక్క పెళ్లితోనే నరకం చూసా.. మళ్లీ ఆ దారి వద్దు అనుకున్నా' అంటూ ఎమోషనల్ అయ్యింది.

Recommended For You
రష్మిక-విజయ్ దేవరకొండ పాటతో 19 లక్షలు.. అనంత శ్రీరామ్‌కు జాక్ పాట్..
రష్మిక-విజయ్ దేవరకొండ పాటతో 19 లక్షలు.. అనంత శ్రీరామ్‌కు జాక్ పాట్..

ఇక ఆమెకు అత్యంత సన్నిహితుడు దివంగత నటుడు శరత్ బాబు (Sarath Babu). ఆయనతో తనకు ఉన్న అనుబంధం ఉందని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని చాలా కాలం గోప్యంగా ఉంచిన జయలలిత, ఇప్పుడు మొదటిసారి ఓపెన్ అయింది. 'ఆయన్ని నేను మనసారా ప్రేమించాను. ఆయనతో కలిసి జీవించాలని, పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కనాలని కూడా అనుకున్నాం' అని ఆమె వెల్లడించింది.

You May Also Like
Ranveer Singh: ధురంధర్ హీరో నెక్ట్స్ మూవీ ఫిక్స్.. క్రేజీ బ్యూటీ జోడీ కట్టనుండా?
Ranveer Singh: ధురంధర్ హీరో నెక్ట్స్ మూవీ ఫిక్స్.. క్రేజీ బ్యూటీ జోడీ కట్టనుండా?

అయితే, వారి ప్రేమ కథ పెళ్లి వరకు వెళ్లలేదు. శరత్ బాబు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి అని, తమకు పుట్టే బిడ్డకు ఆస్తి విషయంలో ఇబ్బందులు వస్తాయేమోనని భయపడి పెళ్లి నిర్ణయం తీసుకోలేకపోయారని ఆమె తెలిపింది. ఈ నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందని, కానీ ఆయనను ఎప్పటికీ మంచి వ్యక్తిగానే గుర్తుంచుకుంటానని చెప్పింది.

'అల్లు అర్జున్ అంటే పిచ్చి.. ఆయన కోసం 15 రోజులు అన్నం మానేశా..'
'అల్లు అర్జున్ అంటే పిచ్చి.. ఆయన కోసం 15 రోజులు అన్నం మానేశా..'

జయలలిత మాట్లాడుతూ.. శరత్ బాబు కేవలం నాకు ప్రేమికుడే కాదు, ఆధ్యాత్మిక మార్గదర్శి కూడా. ఆయనతో కలిసి ఎన్నో యాత్రలు చేశాను. ఆయనను 'అయ్యప్ప స్వామి లాంటి వ్యక్తి' భావించినట్లు పేర్కొంది. ఆయనతో జీవితం గడపాలని అనుకున్నా, అది నెరవేరకపోవడం తన జీవితంలో పెద్ద బాధగా మిగిలిపోయిందని తెలిపింది.

Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా అనిల్ రావిపూడి.. మల్టీస్టారర్ లో ఫ్లాప్ హీరోయిన్ ?
Anil Ravipudi: ఏం ప్లాన్ చేశావయ్యా అనిల్ రావిపూడి.. మల్టీస్టారర్ లో ఫ్లాప్ హీరోయిన్ ?

ఇండస్ట్రీలో తన అనుభవాల గురించి మాట్లాడుతూ, కొన్ని చేదు నిజాలను కూడా బయటపెట్టింది. గ్లామర్ పాత్రలు చేసిన కారణంగా కొందరు తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, కొన్నిసార్లు పరిస్థితులకు లోబడాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. 'నేను చెడిపోయినా పర్వాలేదు.. నా కుటుంబం బాగుండాలి అనుకున్నా' అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

'ప్రభాస్ అంటే నాకు క్రష్.. ఆయన పక్కన అలా నటించను'
'ప్రభాస్ అంటే నాకు క్రష్.. ఆయన పక్కన అలా నటించను'

జీవితంలో ఎదురైన కష్టాలన్నింటినీ తట్టుకుని, ఇప్పుడు ఆధ్యాత్మిక దిశలో నడుస్తున్నట్టు జయలలిత తెలిపింది. కేరళలో డిటాక్స్ ప్రోగ్రామ్‌కు వెళ్లిన తర్వాత తనలో పెద్ద మార్పు వచ్చిందని, భయం అనే భావనే పోయిందని చెప్పింది. ఇప్పుడు జీవితం ఎలా ఉన్నా స్వీకరించగల ధైర్యం వచ్చిందని పేర్కొంది. ఇలా ఈ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి.

More from Filmibeat

Read more about: sarath babu jayalalitha tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X