Suman : సుమన్ అరెస్టుకు అసలు కారణమదే.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన హీరోయిన్..
Suman: సీనియర్ హీరో సుమన్ (Suman) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఒకనొక సమయంలో స్టార్ హీరోగా వెలుగొందారు. స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలకు సైతం సుమన్ ముచ్చెమటలు పట్టించాడు. కేవలం తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి మెప్పించాడు. ఒకప్పుడూ సౌత్ ఇండియన్ స్టార్ హీరోగా ప్రత్యేక స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. అన్ని భాషల్లో కలిపి దాదాపు 700 చిత్రాలు చేసినా.. తెలుగు సినిమాలోనే సెటిలయ్యాడు. అయితే.. నీలి చిత్రాలను సుమన్ తీసినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు.ఆ అరెస్టు వెనుక అసలు కారణం వేరే ఉందంటూ తమిళ హీరోయిన్ జయశీల
షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
సుమన్ అసలు పేరు సుమన్ తల్వార్. ఆయన స్వస్థలం కర్ణాటక అయినా మద్రాసులో స్థిరపడ్డారు. కాలేజీ లో చదివేటప్పుడు సంగీతంతో పాటు కరాటే నేర్చుకున్నాడు. స్నేహితుల సలహా మేరకు సినిమాల్లోకి వచ్చాడు. అలా 'నీచల్ కులం' అనే తమిళ సినిమా లో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకున్నారు. ఈ క్రమంలోనే 'తరంగిణి' అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు కిలాడీలు సినిమాలో నటించి మెప్పించారు. ఈ సినిమాతో తెలుగులో సుమన్ కు హీరోగా మంచి పేరు వచ్చింది. అనంతరం దక్షిణాది భాషల్లో నటించి మెప్పించాడు. ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉండటంతో యాక్షన్ సినిమాల్లో దుమ్మురేపేవారు.

సుమన్ కెరీర్ లో వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సితార సినిమా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఆ తర్వాత ఆత్మబంధం, మొండిమొగుడు పెంకి పెళ్లాం, బావబావమరిది సినిమాలు తెలుగు ప్రేక్షకుల మరింత దగ్గర చేశాయి. ఆయన చాలా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆయన రొమాంటిక్ హీరోనే కాకుండా భక్తి రస చిత్రాల్లో నటించి మెప్పించారు. అలా సుమన్ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీగా అన్నమయ్య నిలిచింది. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిగా కనిపించి ప్రేక్షకుల నీరజనాలు అందుకున్నారు. అలాగే..
శ్రీరామదాసు సినిమాలో శ్రీరాముడిగా నటించారు.
ఇక శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన 'శివాజీ' సినిమాలో విలన్‌గా సుమన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో సుమన్‌కు విలన్‌గా మంచి పాత్రలు లభించలేదనే చెప్పాలి. హిందీలో క్రిష్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో సుమన్ విలన్‌గా నటించి తన నట విశ్వరూపం చూపించారు. ఆయన తెలుగులో 100 పైగా సినిమాల్లో నటించారు. కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు.. తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, ఒడియా, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు. హాలీవుడ్‌లో 'డెత్ అండ్ టాక్సీస్' సినిమాలో నటించి ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా విభిన్నమైన పాత్రలు చేస్తే కెరీర్ లో బిజీగా ఉన్నాడు సుమన్. మాస్, యాక్షన్ సినిమాల్లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఒకనొక్క సమయంలో సుమన్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూకట్టేవారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కూడా సుమన్ పోటీ పడేవాడు. అయితే నీలి చిత్రాలను తీసినట్లు అనే ఆరోపణలతో సుమన్ ను అరెస్ట్ చేశారు. ఆపై జైలు జీవితం కూడా గడిపాడు. దీంతో ఆయన ఇమేజ్ దెబ్బతిన్నది. దీంతో సినిమా అవకాశాలు తగ్గాయి. దీని వెనుక చాలా మంది కుట్ర ఉందనీ, ఆయనను కావాలనే పక్కా ప్లాన్‌తో ఈ కేసులో ఇరికించారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా సీనియర్ నటి జయశీల ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ అరెస్ట్ వెనుక గల కారణాలను వెల్లడించారు.

సీనియర్ నటి జయశీల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నీలి చిత్రాల విషయంలో సుమన్ జైలుకు వెళ్లలేదని, ఆ నాడు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్, అప్పట్లో తమిళనాడులో పనిచేస్తున్న డీజీపీ, ఒక కాంట్రాక్టర్ వల్లే సుమన్ జైలుకు వెళ్లాడని ఆయన చెప్పారు. ఆ కాంట్రాక్టర్ చాలా పవర్ ఫుల్ అనీ, అతని కూతురిని సుమన్ ఫ్రెండ్ ఒకరు ప్రేమించాడు. ఆ కారణంతోనే నీలి చిత్రాల కేసులో ఇరించారనీ, ఆ సమయంలో తన భర్త ఎస్ఐగా పనిచేస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఆర్డర్స్ మేరకు సుమన్ను అరెస్ట్ చేశారని వెల్లడించారు.
దివాకర్ ఫ్రెండ్ సుమన్ కావడం వల్లనే.. అరెస్టు చేశారని, ఆ సమయంలో తన భర్త బాధపడ్డాడని వెల్లడించారు. అంత ముందు రోజు సుమన్ తో తాను ఓ సినిమాలో నటించానని, ఆ షూటింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా కొనసాగిందని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని, తాను నిలదీశానని అన్నారు. తన చేతుల్లో ఏమీ లేదని సీఎం నుండి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టే తాను అరెస్టు చేశానని తన భర్త తనతో చెప్పారని అన్నారు. సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు సుమన్‌పై ఇలాంటి తప్పుడు కేసు పెట్టడంతో పాటు బెయిల్ రాకుండా ఉండే పలు సెక్షన్స్ నమోదు చేశారు. కానీ అప్పట్లో సుమన్ వచ్చినవి అన్ని పుకార్లేననీ, అవన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం నటి జయశీల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











