ఆ రెండు సీన్లలో మహేష్ గ్రేట్.. డైలాగ్ చెప్పడం మరిచా.. భావోద్వేగంతో కంటతడి.. మహర్షి గురించి జయసుధ

Recommended Video

Actress Jayasudha Revealed Interesting Things About Maharshi Movie || Filmibeat Telugu

ప్రిన్స్ మహేష్‌బాబుపై సీనియర్, సహజనటి జయసుధ ప్రశంసల వర్షం కురిపించారు. తనతో సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవంలో నటించాను.. తాజాగా మహర్షి సినిమాలో నటిస్తున్నాను. మహర్షి సినిమాలో నాకు మరోసారి మంచి పాత్ర లభించింది అని ఆమె చెప్పారు. మహేష్ బాబు గురించి చెబుతూ నాతో బాలనటుడిగా కూడా నటించాడని వెల్లడించారు. ప్రిన్స్ మహేష్ గురించి జయసుధ ఏమన్నారంటే...

కొంచెం గర్వం కూడా ఉండదని

కొంచెం గర్వం కూడా ఉండదని

మహేష్ బాబు సూపర్ స్టార్ అయినా ఏ మాత్రం కొంచెం గర్వం ఉండదు. చాలా నిజాయితీగా ఉంటాడు. నాకు చాలా ఇష్టం. మహేష్‌బాబుతో చిన్నప్పటి నుంచి నాకు అనుబంధం ఉంది. నాకు విజయనిర్మల బంధువులు కావడంతో కృష్ణ గారి కుటుంబంతో మంచి రిలేషన్స్ ఉన్నాయి అని జయసుధ తెలిపారు.

 మహేష్ బాబు డైరెక్టర్ యాక్టర్

మహేష్ బాబు డైరెక్టర్ యాక్టర్

మహేష్ బాబు ప్రతీ సినిమాను తన తొలి సినిమాగా భావించి నటిస్తాడు. అతడు డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్లు ఎలా మలుచుకుంటే అలా ఒదిగిపోతాడు. పెద్ద వాళ్ల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. క్రమశిక్షణ కలిగిన హీరో. అందుకే నాకు మహేష్ అంటే ప్రత్యేకమైన ఇష్టం అని జయసుధ తెలిపారు.

 మరోసారి మంచి నేను పాత్రలో

మరోసారి మంచి నేను పాత్రలో

మహర్షి చిత్రం చాలా మంచి చిత్రం. నేను ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడను. టాలీవుడ్‌లో మంచి చిత్రం అవుతుంది. డైరెక్టర్ గొప్పగా తీశాడు. మరోసారి నేను ప్రకాశ్ రాజ్‌కు భార్యగా నటిస్తున్నాను. ఈ సినిమాలో మా జోడి ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. భావోద్వేగాలు నిండిన పాత్రలు మావి అని జయసుధ తెలిపారు.

 ఆ రెండు సీన్లలో ప్రిన్స్ నటన చూసి

ఆ రెండు సీన్లలో ప్రిన్స్ నటన చూసి

మహర్షి చిత్రంలో మహేష్ బాబు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకట్రెండు సీన్లలో మహేష్ నటన చూస్తూ అలా ఉండిపోయాను. మహేష్ నటనను చూస్తూ నేను నా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం మరిచిపోయాను. ఎంత బాగా చేశాడనే ఫీలింగ్ ఏర్పడింది. భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకొనేంతగా ఇంప్రెస్ చేశాడు. మహర్షి సినిమాకు మహేష్‌కు అవార్డు రావడం కూడా ఖాయమనిపిస్తున్నది అని జయసుధ అన్నారు.

మే 9న మహర్షి మూవీ రిలీజ్

మే 9న మహర్షి మూవీ రిలీజ్

మే 9వ తేదీన రిలీజ్ అవుతున్న మహర్షి చిత్రంలో మహేష్ బాబుతోపాటు పూజా హెగ్డే, అల్లరి నరేష్, ప్రకాశ్ రాజ్, జయసుధ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వంశీ పైడిపల్లి సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X