Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మా అధ్యక్ష పదవికి జయసుధ.. అనూహ్యంగా తెరపైకి సహజనటి పేరు!
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో నిధుల అవకతవకల వార్తలు సంచలనం రేపడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మా అధ్యక్షుడు శివాజీరాజాపైనే ఏకంగా ఆరోపణలు రావడంతో పలు అనుమానాలు తలెత్తాయి. మా అధ్యక్ష పదవి నుంచి శివాజీ రాజా తప్పుకొంటారనే వార్తల మధ్య ఆ పదవికి జయసుధ పేరు బలంగా వినిపిస్తున్నది.
మా అధ్యక్ష పదవికి జయసుధ అయితే హుందాగా ఉంటుంది. ఆ పదవికి, సంస్థకు ప్రతిష్ఠ కలుగుతుంది. ఆమె సరైన వ్యక్తి. మా సంఘానికి విశేష సేవలందించిన అనుభవం ఉంది అని పలువురు సినీ నటులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.
మా వివాదాల మధ్య ఆ పదవి చేపట్టాల్సి వస్తే అందుకు సానుకూలంగా జయసుధ లేనట్టు తెలుస్తున్నది. గతంలో రాజేంద్ర ప్రసాద్ చేతిలో ఆమె పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
మా అధ్యక్ష పదవిని చేపట్టే ఆసక్తి తనకు లేదని విషయం జయసుధ తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం వయసు మీద పడటం వల్ల ఆరోగ్యం సహకరించడం లేదనే విషయాన్ని సాకుగా చూపినట్టు తెలిసింది.