‘ఒకడు నన్ను మోసం చేస్తే.. వాడిపై కోపంతో మరొకడికి ఓకే చెప్పా’

Actress Jyothi: నటి జ్యోతి పేరు వినగానే చాలా మందికి బోల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టే గుర్తుకు వచ్చింది. 2000 దశకంలో వరుస సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన ఆమె, తన ప్రత్యేక నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొని తిరిగి పాపులారిటీ అందుకుంది. షోలో ఎక్కువ రోజులు నిలవకపోయినా, జ్యోతి పేరు మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయింది. ప్రస్తుతం జ్యోతి అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.ఈ మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

నటి జ్యోతి ఇటీవల యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న 'కిస్క్ టాక్' షోలో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను బహిరంగంగా వెల్లడించింది. వర్ష అడిగిన "మీ లైఫ్‌లో అనుకున్నది సాధించారా?" అన్న ప్రశ్నకు జ్యోతి స్పందిస్తూ 'నా కెరీర్ మొదట్లో నేను అన్నింటినీ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. నేను చేసిన పనుల్ని, ఎంచుకున్న నిర్ణయాలను సీరియస్‌గా ఆలోచించలేదు. కానీ విడాకుల తర్వాత జీవితం ఒక్కో అడుగులో ఒక్కో పాఠం నేర్పింది. ఆ సమయంలో సినిమాలు రాక ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాను. 'జీవితం ఇంత కష్టమా?' అని అర్థం అయింది. బాధ, ఒంటరితనం, కష్టాల మధ్య గట్టిగా నిలబడటం నేర్చుకున్నాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యింది.

Actress Jyothi Says Marriage Was My Biggest Mistake Emotional Revelation Goes Viral

అలాగే జీవితం లక్ష్యం గురించి మాట్లాడిన జ్యోతి "నా కుమారుడే నాకు ప్రపంచం. వాడు పుట్టిన రెండో నెలకే నా డైవోర్స్ అయ్యింది. అప్పటి నుంచి నేను ఒంటరిగా ఉండి వాడికి తల్లి, తండ్రిగా ఉంటున్నాను. పెళ్లి చేసుకోకుండా, అన్ని కష్టాలు భరించడానికి కారణం కూడా వాడే. నా గోల్ ఒక్కటే - నా కొడుకు మంచి స్థాయిలో సెట్ కావాలి. వాడి భవిష్యత్తు కంటే నాకు ఇంకేం పెద్దది లేదు" అని చెప్పుకొచ్చింది.

తన వివాహం గురించి జ్యోతి మాట్లాడుతూ.. "నా జీవితంలో అత్యంత మూర్ఖమైన నిర్ణయం... నా పెళ్లి. ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను. అతను నన్ను మోసం చేశాడు. ఆ కోపంలో వెంటనే మరో అబ్బాయి ప్రపోజ్ చేయగానే పెళ్లి చేసుకున్నాను. ఏ ఆలోచన లేకుండా తీసుకున్న ఆ నిర్ణయం నా జీవితంలో ఒక మచ్చలా మిగిలిపోయింది" అని ఎమోషనల్ అయ్యింది.

ఇప్పటి అమ్మాయిలకు సందేశం ఇస్తూ "పెళ్లయిన వాడిని ప్రేమించవద్దు. దానికి మించిన దారుణం లేదు. చివరికి బాధపడేది మీరే. ఎవరైనా మీకు తప్పుడు ఆశలు పెడితే, వెంటనే దూరంగా వెళ్లిపోవాలి" అని జ్యోతి హెచ్చరించింది.

చివరగా రెండో పెళ్లి గురించి జ్యోతి మాట్లాడుతూ "నన్ను అర్థం చేసుకునే మంచి మనిషి దొరికితే... నేను రెండో పెళ్లి చేసే ఆలోచన ఉంది. ఎందుకంటే నేను కూడా జీవితాన్ని ప్రేమించాలి, నా మనసుని కూడా చూడాలి" అని పేర్కొంది. ప్రస్తుతం నటి జ్యోతి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

More from Filmibeat

Read more about: anchor varsha bigg boss jyothi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X