5 రూపాయలిచ్చి 500 అని చెప్పుకునే రకం కాదు.. ఆ ఇద్దరు హీరోల గురించి జ్యోతిక!
హీరో సూర్యతో వివాహం తర్వాత జ్యోతిక వెండితెరకు దూరమైంది. ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది జ్యోతిక కాట్రిన్ మొళి చిత్రంలో నటించింది. జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపై దృష్టి పెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల జ్యోతిక ఓ కార్యక్రమానికి హాజరై స్టార్ హీరో అజిత్, విజయ్ కాంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇతరుల సహకారం లేకుండా ఈ ప్రపంచంలో జీవించడం వీలు కాదు. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా ఇతరుల సాయం ఆశించడం సరైంది కాదు అని జ్యోతిక తెలిపింది. మనకు సాయం చేసిన వారిని ఎప్పటికి మరచిపోకూడదు. అలాగే చేసిన సాయాన్ని చెప్పుకోకూడదు. కొందరు మాత్రం ఎంత సాయం చేసినప్పటికీ బయటకు చెప్పుకోరు. అది వారిలోని మంచి గుణం. అలాంటి వారు అజిత్, విజయ్ కాంత్ అని జ్యోతిక తెలిపింది.

ఇంకొందరు ఉంటారు.. 5 రూపాయలు సాయం చేసి 500 అని డబ్బా కొడతారు. అజిత్, విజయ్ కాంత్ అలాంటివాళ్ళు కాదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో అజిత్, విజయ్ కాంత్ లాంటి మంచి మనుషులు ఉండడం ప్రశంసించ దగ్గ విషయం అని జ్యోతిక తెలిపింది.


Click it and Unblock the Notifications











