ఆంటీ అన్నవాళ్లకు షాకిస్తున్న కాజల్.. మరీ ఇంత స్పీడా?
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది కాజల్ అగర్వాల్. అమ్మడు ఎలాంటి సినిమా చేసినా గ్లామర్ కంటే కూడా తన నవ్వుతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పటికే 13 ఏళ్లవుతోంది. కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా అందుకుంటోంది.

లవ్ రూమర్స్..
కాజల్ కెరీర్ ను మొదటి నుంచి చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. పెద్దగా కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళ్లింది. అప్పుడప్పుడు లవ్ రూమర్స్ కాస్త ఇబ్బంది పెట్టాయి. ఒక బిజినెస్ మెన్ తో ప్రేమాయణం నడిపినట్లు టాక్ వచ్చింది. అలగే యువ హీరోతో ఎఫైర్ అంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. వాటిని పట్టించుకోకుండా కాజల్ సైలెంట్ గానే క్లారిటీ ఇస్తోంది.

స్టార్ హీరోయిన్స్ కి పోటీగా..
సమంత, అనుష్క, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ నిత్యం పోటీ ఇస్తున్నప్పట్టికి కాజల్ అగర్వాల్ క్రేజ్ తగ్గలేదు. మగధీర నుంచి స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంటూ వస్తోన్న అమ్మడు ఇప్పుడు కూడా రష్మీక మందన్న, పూజా హగ్డే వంటి హీరోయిన్స్ కి ధీటుగా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది.

మెగా ఆఫ3ర్స్..
నెక్స్ట్ మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటించనున్న అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్న సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందట. ఇదివరకే పవన్ తో కాజల్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150లో నటించింది. ఇక ఇప్పుడు మెగా బ్రదర్స్ తో ఒకేసారి ఛాన్స్ కొట్టేసి లక్కీ గర్ల్ అని నిరూపించుకుంది.

ఆంటీ అన్నవాళ్లే షాక్ అయ్యేలా...
ఇటీవల కాజల్ ఎదుర్కొన్న డిజాస్టర్స్ అమెను ట్రోలింగ్ కి గురి చేశాయి. సీత - రణరంగం సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆంటీ పనైపోయింది అని కాజల్ పై కొంతమంది నెటీజన్స్ మీమ్స్ తో హేళన చేయడం అమ్మడిని కూడా బాధించింది. అప్పుడే కాజల్ కోపం తెచ్చుకోకుండా నెగిటివ్ కామెంట్స్ కి సింపుల్ స్మైల్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నవాళ్ళు షాక్ అయ్యేలా బడా సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది. దీంతో కాజల్ ఏంటి మరీ ఇంత స్పీడ్ గా ఉందని మరికొందరు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











