Kajal Aggarwal పండంటి బిడ్డకు జన్మినిచ్చిన కాజల్.. అలా సీక్రెట్‌గా ఉంచిన బ్యూటీ!

అందాల నటి, హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాజల్ కుటుంబం ఈ శుభవార్తపై ఎలాంటి ప్రకటన అధికారికంగా ఇవ్వలేదు. అయితే బాలీవుడ్ మీడియా వర్గాలు మాత్రం ఈ వార్తను ధృవీకరించాయి. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు అనే విషయాన్ని తమ కథనాల్లో స్పష్టం చేశారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 ముంబై వ్యాపారవేత్తతో ప్రేమ వివాహం

ముంబై వ్యాపారవేత్తతో ప్రేమ వివాహం


దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ముంబైలోని వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడ్డారు. కొద్ది రోజుల డేటింగ్ అనంతరం వారిద్దరూ 2020 అక్టోబర్ 30 తేదీన సంప్రదాయ పద్దతుల్లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విహారయాత్రల్లో దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

 భార్య ప్రెగ్రెన్సీని వార్తను గౌతమ్ చేరవేసి..

భార్య ప్రెగ్రెన్సీని వార్తను గౌతమ్ చేరవేసి..


ఆచార్య షూటింగులో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ అగర్వాల్ ప్రెగ్రెంట్ అయ్యారనే వార్తను భరత్ గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నా భార్య ఎప్పుడూ అందంగా కనిపిస్తుంది అని కామెంట్ చేస్తూ.. గర్బం దాల్చిన మహిళ బొమ్మను పెట్టి.. కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఫ్యాన్స్ తెలియజేశాడు.

 ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌తో కాజల్

ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌తో కాజల్


ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఇటీవల గౌతమ్, కాజల్ చేసిన ప్రెగ్నెన్సీ, బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే కాజల్‌ను కొందరు నెటిజన్లు టార్గెట్ చేస్తూ.. బాడీ షేమింగ్ చేస్తూ.. ట్రోల్ చేయడం వివాదంగా కూడా మారింది.

మాతృత్వం గురించి సోషల్ మీడియాలో

మాతృత్వం గురించి సోషల్ మీడియాలో


కాజల్ అగర్వాల్ డెలివరీకి ముందు మాతృత్వం గురించి భావోద్వేగంగా స్పందించారు. మాతృత్వం అనేది అద్బుతమైనది. ఒక మూమెంట్‌లో అంతా మన చేతిలో ఉందని అనుకొంటాం. కానీ మరో క్షణం గడిస్తే.. మన చేతిలో ఏమీ లేదనే విషయం స్పష్టమవుతుంది. నిద్రించే సమయంలో నేను ఎలా మేనేజ్ చేస్తానా అనే ఫీలింగ్ కలిగేది. ఇలాంటి సమయంలోనే మన తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. అప్పుడు రకరకాల బాధలను, సంతోషాలను మరిచిపోతాం అని ఇన్స్‌టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

పండంటి మగబిడ్డకు జననం

పండంటి మగబిడ్డకు జననం

ఇలాంటి భావోద్వేగాల మధ్య కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ మంగళవారం అంటే.. ఏప్రిల్ 19వ తేదీన ముంబైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో పండంటి అబ్బాయికి జన్మనిచ్చారు. కాజల్, ఆమె బిడ్డ ఆరోగ్యం బాగుంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారనే విషయాన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే కాజల్ దంపతులు అధికారికంగా ఈ వార్తను వెల్లడించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X