Kajal Aggarwal Hot Pics: జిమ్‌వేర్‌లో ఘాటుగా.. అది అడ్డు లేకపోతే అంతే!

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు దశాబ్ధ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. హీరోయిన్‌గా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన ఈ బ్యూటీ.. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. అయితే, ఈ మధ్య సినిమాల వేగం తగ్గించింది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన జిమ్‌వేర్ ధరించి దిగిన హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

 అలా మొదలైన కాజల్ సినీ ప్రయాణం

అలా మొదలైన కాజల్ సినీ ప్రయాణం

మోడల్‌ కెరీర్‌ను ఆరంభించి నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'లక్ష్మీ కల్యాణం'తో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. తెలుగులో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో లక్కీ హీరోయిన్‌గా పేరొంది రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంది.

 ఎవ్వరినీ వదిలి పెట్టని కాజల్ అగర్వాల్

ఎవ్వరినీ వదిలి పెట్టని కాజల్ అగర్వాల్

ఆరంభంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంది కాజల్ అగర్వాల్. ఏ సినిమా చేస్తే అది హిట్ అనేలా ఈ అమ్మడు కథలను ఎంచుకుంది. ఫలితంగా అప్పట్లో తన హవాను చూపించింది. ఇక, రోజులు గడిచిన కొద్దీ స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించింది. అలాగే, 'ఖైదీ నెంబర్ 150' చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవి సరసనా నటించింది.

గడ్డు పరిస్థితి కాదు... తీరు మారిందిగా

గడ్డు పరిస్థితి కాదు... తీరు మారిందిగా

దాదాపు ఐదారేళ్ల పాటు కాజల్ అగర్వాల్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ నటించింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె సినిమాల వేగం తగ్గించేసింది. అలా అని ఈ బ్యూటీకి అవకాశాలు రావట్లేదని కాదు.. చాన్స్‌లు వచ్చినా సెలెక్టివ్‌గానే సినిమాలను చేస్తోంది. ఫలితంగా తక్కువ చిత్రాల్లో నటిస్తూ వస్తుంది.

బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమ.. లాక్‌డౌన్ పెళ్లి

బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమ.. లాక్‌డౌన్ పెళ్లి

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడే కాజల్ అగర్వాల్.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. అయితే, చాలా మందిలా పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా.. తన కెరీర్‌ను కొనసాగిస్తూ తన స్టార్‌డమ్ తగ్గలేని నిరూపిస్తోంది.

భారీ డిజాస్టర్.. ఇద్దరు సీనియర్లు జోడీ

భారీ డిజాస్టర్.. ఇద్దరు సీనియర్లు జోడీ

పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో 'మోసగాళ్లు' అనే సినిమా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో ఆమె మంచు విష్ణుకు సోదరిగా నటించింది. ఇక, ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అక్కడ మాత్రం కాజల్ ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం కాజల్ ఎప్పుడూ బిజీగా

వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించడంతో పాటు అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Recommended Video

BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
జిమ్‌వేర్‌లో ఘాటుగా కాజల్ అగర్వాల్

జిమ్‌వేర్‌లో ఘాటుగా కాజల్ అగర్వాల్

నిత్యం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసే కాజల్ అగర్వాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు జిమ్‌వేర్ ధరించి హాట్ లుక్‌తో కనిపిస్తోంది. ఈ పిక్‌లో ఎద అందాలు కనిపించకుండా జుట్టుతో కవర్ చేసుకుంది. దీంతో ఈ పిక్‌కు ఇప్పటికే మిలియన్‌కు పైగా లైకులు వచ్చాయి. ఫలితంగా కాజల్ అగర్వాల్ హాట్ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X