Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కాజల్ పెళ్లి డ్రెస్ ధర ఎంతో తెలుసా? నెల రోజులు కష్టపడిన 20 మంది!
కాజల్ అగర్వాల్ ఇటీవల తన బాయ్ ప్రియుడు గౌతమ్ కిచ్లును సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాలా వరకు పెళ్లి విషయంలో ఏడేళ్లుగా సీక్రెట్ గా మెయింటైన్ చేసిన చందమామ మొత్తానికి ఇటీవల బ్రేకింగ్ న్యూస్ తో ఓ వర్గం వారికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక షాక్ ఇచ్చిన కొన్నిరోజులకె పెళ్లి చేసుకొని మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇక ముంబైలో అతి తక్కువమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న కాజల్ ఎక్కువగా తన పెళ్లి డ్రెస్ తోనే ఆకట్టుకుంది.
అంతకు మించి అనేలా..పెళ్లి డ్రెస్
ముంబైలోని తాజ్ హోటల్ లో గత వారం పెళ్లి చేసుకున్న కాజల్ నెవర్ బోఫోర్ అనే లుక్ తో దర్శనమిచ్చింది. గతంలో ఎన్నో రకాల ఖరీదైన డ్రెస్సులు వేసుకున్న కాజల్ పెళ్లి వేడుకలో మాత్రం అంతకు మించి అనేలా కనిపించింది. గులాబి రంగు లెహెంగాలో పెళ్లి కుమార్తెగా ముస్తాబైన చందమామ తన నవ్వును కూడా జోడించి మరింత బ్యూటీఫుల్ గా వెలిగింది.
ఆ డ్రెస్ కోసం 20 మంది..
కాజల్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఆ డ్రెస్ రెడీ చేయడానికి సమయం చాలానే పట్టిందట. దాదాపు 20 మంది ఆ డ్రెస్ కోసం వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన ఈ డ్రెస్ ను ప్రేమగా తయారు చేశామంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఫ్లోరల్ డిజైన్లో జర్దోసీ వర్క్ వేయడానికి నెలరోజులపాటు పనిచేశారట.
దాని ధర ఎంతంటే..?
గతంలో మిహీకా బజాజ్, సోనమ్ కపూర్, మీరా కపూర్ వంటి సెలబ్రెటీల పెళ్లి వేడుకలకు కూడా అనామిక పెళ్లి రోజు కోసం ప్రత్యేకంగా లెహెంగాలను డిజైన్ చేశారు. వీటి ధర మినిమామ్ రెండు మూడు లక్షలకు తక్కువగా ఉండదు. ఇక కాజల్ డ్రెస్ కోసం దాదాపు నెలరోజుల పాటు 20మంది వర్క్ చేశారు కాబట్టి దాని విలువ 4లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం.
పెళ్లి కొడుకు కూడా ఖరీదైన షేర్వాణీలో..
ఇక వరుడు గౌతమ్ కిచ్లు కూడా పెళ్లి డ్రెస్ లో కాజల్ కి తగిన వరుడిగా కనిపించాడు. ఫేమస్ స్టైలిష్ట్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన తెలుపు రంగు షేర్వాణీ ధరించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక దాని ధర రూ.1,15,000. మెహెందీ ఫంక్షన్లో కూడా వీరు వేసుకున్న డ్రెస్సులు కూడా చాలా ఖరీదైనవే. కాజల్ ఆకుపచ్చ కుర్తాలో కనిపించారు. దీని విలువ 24,500 రూపాయలు ఉంటుందట.
Recommended Video
హనీమూన్ క్యాన్సిల్
ఇక పెళ్లి వేడుక అనంతరం వెంటనే హనీమూన్ కి వెళ్లాలని అనుకున్న కాజల్ షూటింగ్స్ వలన క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆచార్య షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ముందుగానే డేట్స్ ఇవ్వడంతో ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోలేని పరిస్థితి. అందుకే కొంచెం ఖాళీగా ఉన్నపుడే హనీమూన్ డేట్ ని ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారట.