twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్‌కు పెద్దలు కుదిర్చిన పెళ్లి.. వరుడు ఎవరంటే.. అందుకే ఆ విషయంలో..

    |

    దశాబ్దకాలంగా సుదీర్ఘమైన కెరీర్‌తో దూసుకెళ్తున్న యువ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. 2005‌లో సినీ రంగంలోకి ప్రవేశించిన కాజల్ తన తొలి సినిమా హిట్టు కావడంతో కెరీర్ పరంగా వెనుకకు చూసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఇటీవల కాలంలో కుర్ర హీరోయిన్ల తాకిడి పరిశ్రమకు ఎక్కువ కావడం, అలాగే సక్సెస్ రేట్ తగ్గడంతో కాజల్ కెరీర్ ఇంతకు ముందున్నంత వేగంగా ముందుకెళ్లడం లేదు. గత కొద్దికాలంగా పెళ్లి గురించి వార్తలు వచ్చినా అంతగా ప్రాధాన్యం దక్కలేదు. కానీ తాజాగా ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం మీడియాలో ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

    వ్యాపారవేత్తతో పెళ్లి?

    వ్యాపారవేత్తతో పెళ్లి?

    సన్నిహిత వర్గాలు తెలిపిన ప్రకారం.. పెద్దలు కుదిర్చిన పెళ్లికి కాజల్ అగర్వాల్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఓ వ్యాపార వేత్తను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే జీవితంలో సెటిల్ కావాలనే నిర్ణయాన్ని తీసుకొన్నట్టు సమాచారం. పెద్దల సూచన మేరకు కాజల్ కూడా సిద్ధపడినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లిగా మారిన విషయం తెలిసిందే.

    నిర్మాతగా మారేందుకు

    నిర్మాతగా మారేందుకు

    పెళ్లి విషయం పక్కన పెడితే.. కొన్నాళ్లుగా కాజల్ నిర్మాతగా మారేందుకు ప్లాన్ చేస్తున్నది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించాలని ప్రయత్నాలు చేస్తున్నది. తన బ్యానర్‌కు KA ఫిల్మ్స్ అనే పేరును కూడా ఖరారు చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ ఇటీవల వెల్లడించారు.

    తేజతో సినిమా ప్లాన్

    తేజతో సినిమా ప్లాన్

    తనకు గురువు లాంటి దర్శకుడు తేజతో సినిమాను నిర్మించే ప్లాన్ కూడా రూపొందించారు. అలాగే ప్రశాంత్ వర్మతో కూడా ఓ సినిమాను చేయాలనుకొంటున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం ప్లాన్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. పెళ్లి ప్లాన్ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ సినీ నిర్మాణంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకొన్నట్టు సమాచారం.

    పలు చిత్రాలతో బిజీగా

    పలు చిత్రాలతో బిజీగా

    ప్రస్తుతం కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకొన్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఇంకా ఆమె నటించిన క్వీన్ రీమేక్ విడుదల కావాల్సి ఉంది. అలాగే తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నది. అలాగే హిందీలో సంజయ్ గుప్తా దర్శకత్వం వహించే ముంబై సాగా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

    English summary
    Actress Kajal Aggarwal is getting ready for Arrange marriage. Reports suggest that She is okayed for the parents decision. So that she back from idea of becoming the producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X