కాజల్ అగర్వాల్ రిటైర్మెంట్ పై మరో షాకింగ్ లీక్.. అవే చివరి సినిమాలు?

టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. అమ్మడు తన నవ్వుతోనే కుర్రాళ్ళ మనసు దోచేయగలదు. ఇక వెండితెరపై ఎన్ని విభిన్నమైన సినిమాలు చేసిన కాజల్ పెళ్లి తరువాత కాస్త స్పీడ్ తగ్గించింది.

ఇక భర్త సపోర్ట్ తో ఆమె కొన్ని సినిమాలు బాగానే చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఉన్నట్లు టాక్ వస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కాజల్ చేయబోయే చివరి సినిమా అదే అంటూ అనేక రకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

Actress kajal aggarwal retirement plan and last movies details

స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఏకంగా దశాబ్దకాలం పాటు టాప్ చైర్ లో తన కెరియర్ ని కొనసాగించింది. దాదాపు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోల అందరితో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక రెండేళ్ళ క్రితం తన స్నేహితుడు, ప్రియుడు గౌతమ్ కిచ్లూని కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది.

Actress kajal aggarwal retirement plan and last movies details

తల్లిగా మారిన తరువాత: పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. ఈ లోపు ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన మెజారిటీ టైమ్ ని కొడుకుతోనే గడుపుతోంది. పెళ్లి తర్వాత బాలకృష్ణకి జోడీగా భగవంత్ కేసరి మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో పాటు లాంగ్ బ్యాక్ కమిట్ అయిన ఇండియన్ 2 సినిమా పూర్తి చేసే పనిలో ఉంది.

Actress kajal aggarwal retirement plan and last movies details

రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత: అయితే ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఇక నటిగా కెరియర్ కి ముగింపు చెప్పాలని కాజల్ అగర్వాల్ భావిస్తున్నారంట. ఇప్పటికే కాజల్ అగర్వాల్ చెల్లి నిధి అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పింది. చెల్లెలు దారిలోనే కాజల్ అగర్వాల్ కూడా ఇప్పుడు వెళ్లాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ కారణంగానే కొంత మంది దర్శకులు అప్రోచ్ అవుతున్న కూడా సున్నితంగా తిరస్కరిస్తుందని టాక్.

Actress kajal aggarwal retirement plan and last movies details

వ్యాపారంలో కూడా బిజీ అవ్వాలని: ఇక పెళ్లి తర్వాత భర్తతో కలిసి కాజల్ అగర్వాల్ ఓ కిడ్స్ కాస్ట్యూమ్స్ కి సంబందించిన వ్యాపారం స్టార్ట్ చేసింది. అలాగే చెల్లెలు నిధి అగర్వాల్ తో కూడా ఓ వ్యాపారం స్టార్ట్ చేసింది. ఇక సినిమాలకి రిటైర్మెంట్ ఇచ్చేసి పూర్తిగా వ్యాపారాలపై ఫోకస్ పెట్టడంతో పాటుగా కొడుకు బాద్యతలు చూసుకోవాలని కాజల్ భావిస్తుందంట.

ఇప్పుడిదే ఇండస్టీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్, లుక్స్ పరంగా కూడా చాలా మార్పు వచ్చింది. మునుపటి అందం ఆమెలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సినిమాలకి స్వస్తి చెప్పడం బెటర్ అనే మాట కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ అభిమానులు మాత్రం ఆమె నటిగా కొనసాగాలని కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X