Kalpika Ganesh: చీర కొంగు తీసేసి స్టన్ అయ్యేలా చేసిన తెలుగమ్మాయి.. బ్లాక్ బ్యాక్ అంటూ..

సైడ్ క్యారెక్టర్స్ లో నటించిన వాళ్లు అంటే ఒకప్పుడు సినిమాల్లో తప్పితే బాహ్య ప్రపంచంలో ఎక్కువగా హైలైట్ అయ్యేవారు కాదు. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం ఆ రూట్లో చాలామంది మంచి క్రేజ్ అందుకుంటున్నారు అనే చెప్పాలి. ఇక సినిమాల్లో చాలా హోమ్లీగా కనిపించే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో మతిపోగొట్టేస్తున్నారు.

ఇక అలాంటి వాళ్లలో కల్పిక గణేష్ ఒకరు. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన చాలా వేగంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక రీసెంట్ గా మరోసారి ఆమె చీర కొంగు తీసేసి షాక్ ఇచ్చేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి ఆ వివరాల్లోకి వెళితే..

సినిమా ప్రయాణం

సినిమా ప్రయాణం

కల్పిక గణేష్ మొదట తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె హైదరాబాదులోనే పుట్టి ఇక్కడే తన చదువును పూర్తి చేసుకున్నారు. మొదట ఆమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడం జరిగింది. ఇక ఆ తర్వాత చంద్రశేఖర్ ఏలేటి మంచు మనోజ్ కలయికలో వచ్చిన ప్రయాణం సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ లో నటించి ఆ విధంగా ప్రయాణం మొదలుపెట్టారు.

ఆ సినిమాతో గుర్తింపు

ఆ సినిమాతో గుర్తింపు

ఆరెంజ్, జులాయి, సారొచ్చారు, నిప్పు ఇలా విభిన్నమైన సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ వచ్చిన కల్పిక గణేష్ ఎక్కువగా గుర్తింపు అందుకుంది మాత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతోనే. ఈ మల్టీస్టారర్ సినిమాలో ఆమె హీరోయిన్ సోదరి పాత్రలో నటించిన విధానం మంచి అవకాశాలు వచ్చేలా చేసింది.

ఎవరు నమ్మలేదు

ఎవరు నమ్మలేదు

అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కల్పిక గణేష్ కనిపించిన విధానం చూసి ఆమె చాలా హోమ్లీ గా ఉండే అమ్మాయి అని అనుకున్నారు. అయితే ఆ తర్వాత కల్పిక గ్లామరస్ అందాలతో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మొదటి సారి చూసిన ఎవరు కూడా నమ్మలేదు. తాను కల్పిక గణేష్ కాదు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.

అందాలను హైలెట్ చేస్తూ..

అందాలను హైలెట్ చేస్తూ..

ఎవరు ఊహించిన విధంగా ఒకసారి కల్పిక గణేష్ బికినీలో కూడా కనిపించింది. ఒకవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరొకవైపు స్టైలిష్ డ్రెస్ లలో కూడా ఆమె అందాలను హైలైట్ చేస్తూ తన ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంది. ఒక విధంగా కల్పిక అన్ని రకాల పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తన ఫోటోషూట్స్ ద్వారానే తెలియజేసింది.

చీర కొంగు కూడా తీసేసి

చీర కొంగు కూడా తీసేసి

రీసెంట్ గా కల్పిక గణేష్ కు సంబంధించిన మరికొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె బ్లాక్ చీరలో చాలా అందంగా నిలబడి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది అలాగే ఒక ఫోటోలో చీర కొంగు కూడా తీసేసి కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. గతంలో చాలాసార్లు ఇంతకంటే హై రేంజ్ లో కల్పిక ఫోటోలను పోస్ట్ చేసినప్పటికీ ఈ స్టిల్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అని కామెంట్ చేస్తున్నారు.

 బ్లాక్ అనేది బ్యాక్..

బ్లాక్ అనేది బ్యాక్..

అయితే కల్పిక గణేష్ ఆ ఫోటోలు పోస్ట్ చేయగానే విభిన్నంగా క్యాప్షన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. బ్లాక్ ఫ్రేమ్ ఎక్కువగా కనిపించడంతో బ్లాక్ అనేది బ్యాక్ అంటూ తన ఫోటోకు సరికొత్త నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏదేమైనా కల్పిక గణేష్ ని అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లుగా ఈ ఫోటోల ద్వారా ఒక సంకేతాన్ని పంపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరి ఈ తరహాలో అమ్మడు ఏవైనా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X