‘నాపై అలా రేప్ ప్రయత్నం.. నేను అలా చేశా కాబట్టి బతికి బయటపడ్డా’
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో ఉన్న ప్రిజమ్ పబ్‌లో తన బర్త్ డేను జరుపుకొనేందుకు టాలీవుడ్ నటి కల్పిక తన స్నేహితులతో కలిసి వెళ్లింది. అర్ధరాత్రి వరకు వారు అక్కడ వేడుకలను జరుపుకొంటూ ఎంజాయ్ చేశారు. పబ్ ముగింపు సమయంలో డిజర్ట్ విషయంలో కల్పిక అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో వారి మధ్య గొడవకు దారి తీసింది. ఆ క్రమంలో ఆ వాగ్వాదాన్ని ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్ చేసింది. ఆ వివాదంపై మాట్లాడుతూ..
ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నించినందుకు గాను, అలాగే బిల్ చెల్లింపులో వాగ్వాదం జరగడం ఈ గొడవకు, దాడికి కారణం. దాదాపు గంటన్నర సేపు పబ్ యాజమాన్యంతో నాకు గొడవ జరిగింది. నేను చేసిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. పబ్ యాజమాన్యం పట్ల పోలీసులు ఉదారంగా వ్యవహరించారు. వారు గొడవను చూస్తూ ఆడియెన్స్ మారిగా చూస్తూ నిలుచున్నారు. దాంతో గచ్చిబౌలి పోలీసుల తీరు చూసిన తర్వాత ఈ గొడవలో నాకు న్యాయం జరుగుతుందని అనిపించలేదు అని కల్పిక చెప్పింది.

Photo Credit: https://www.instagram.com/imkalpika/
నేను ఫ్రెష్ గాలి కోసం పబ్ నుంచి బయటకు వచ్చాను. నేను బయటకు వస్తుంటే ఈగల్లాగా నన్ను చుట్టుముట్టి నా వెనుకే బౌన్సర్లు వచ్చారు. నా వెనుక ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తే సమాధానం లేదు. నేను వీడియో తీస్తుంటే వారు ముఖం దాచుకొన్నారు. బౌన్సర్లుగా పనిచేసే మీకు ముఖం చూపించే దమ్ము లేదా? అని అడిగితే సమాధానం లేదు. నేను కారును వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చాను. దాంతో కారు తాళాలు వారికి ఇస్తే.. వాళ్ల కారు తెచ్చారు. దాంతో చల్లటి గాలి కోసం కారులో కూర్చొన్నాను. దానికి నేను అక్కడి నుంచి వెళ్లిపోతున్నానని అనుకొన్నారు అని కల్పిక చెప్పారు.
పబ్‌లో గొడవ జరిగినప్పుడు చాలా మంది ఉన్నారు. అందులో అన్ని భాషల వారు ఉన్నారు. నాపై వారు దాడికి పాల్పడుతుంటే ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. నాపై దాదాపు రేప్ చేసినంత పనిచేశారు. మారు మాటలతోనే రేప్ చేసినట్టుగా మాట్లాడారు. వారు చేష్టలు చూస్తే..రేప్ చేస్తారా అనే భయం కలిగింది. నిజంగా నాపై లైంగిక దాడికి ఎందుకు పాల్పడలేదంటే? నేను నా ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో ఉన్నాను కాబట్టి. అలా నేను బతికి పోయాను. ఇన్స్‌టాగ్రామ్ లైవ్ పెట్టడం వల్ల నన్ను చూసి బయపడ్డారు అని కల్పిక చెప్పారు.
బ్రౌనీ కేక్ విషయంలో గొడవ జరిగింది. వారు నాతో వ్యవహరించిన తీరు నాకు నచ్చలేదు. వారు సారీ చెబితేనే నేను బిల్ కడుతాను అని చెప్పాను. పోలీసులు కూడా ప్రేక్షకుల్లా నిలబడ్డారు. వారు తెచ్చిన బ్రౌనీ కేక్‌ను కిందపడేశాను. మేము ఆర్డర్ చేయగా వచ్చిన ఫుడ్‌ను కూడా కిందకు నెట్టాను. వారి ప్రవర్తన కారణంగానే నేను బిల్ కట్టలేదు. అందుకే వారితో గొడవ జరిగింది అని కల్పిక గణేష్ తన వాదనను వినిపించింది.
అయితే ఈ వివాదంలో మరో కోణం కూడా తెరపైకి వచ్చింది. తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడానికే కల్పిక ఈ గొడవను క్రియేట్ చేసింది. లైవ్‌లో సబ్ స్క్రైబర్స్ పెరిగారా? అంటూ కామెంట్ చేయడం కూడా వినిపించింది. అయితే ఈ వివాదంలో ఆమె తీరుపై పోలీసులు కూడా గుర్రుగా ఉన్నారు. ఈ కేసు విచారణలో తుది వ్యవహారం ఎలాంటి ముగింపు ఇస్తుందనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











