అనసూయ.. నీ కొడుకులు అలాంటి అమ్మాయిలతో తిరిగితే ఒకేనా? విరుచుకుపడ్డ కరాటే కల్యాణి

దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు ధరించే అర్ధనగ్న దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపాయి. మహిళలను కించపరిచే విధంగా కామెంట్స్ చేసే అర్హత ఆయనకు ఉందా? డ్రెస్సింగ్ అనేది మా వ్యక్తిగతమైన అభిప్రాయం. మోరల్ పోలీసింగ్‌ పేరిట మా స్వేచ్ఛను అడ్డుకొంటారా? అంటూ నటి అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించారు. అయితే ఈ ఘటనపై జీ టెలివిజన్ ఛానెల్‌లో నటి కరాటే కల్యాణి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అనసూయ, చిన్మయి చేసిన కామెంట్లపై విరుచుకుపడ్డారు. కరాటే కల్యాణి వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

సినిమాల్లో కథ డిమాండ్ చేస్తే పాత్రను బట్టి దుస్తులు ధరించడం వేరు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా దుస్తులను ధరించి వెళ్లడం సరికాదు. ఎందుకంటే ఫంక్షన్లలో అలాంటి దుస్తులను ధరించే హీరోయిన్లను చూసి పిల్లలు అలాగే డ్రస్సెస్ కుట్టించుకొంటారు. దాని వల్ల ఇంట్లో తండ్రి, సోదరులు, ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడుతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శివాజీ ఓ అన్నగా, తండ్రిగా ఆలోచించి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ చెప్పిన విషయంలో ఆయన దృష్టి కోణంలో ఎలాంటి తప్పు లేదు. ఆయన వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయి అని కరాటే కల్యాణి అన్నారు.

Actress Karate Kalyani Questions Anasuya Bharadwaj

శివాజీ వ్యాఖ్యల వెనుక ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేదు. ఆయన పాలిష్‌డ్‌గా చెప్పలేకపోయారు. ఏదో పాయింట్ అవుట్ చేయాలి కాబట్టి కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు ఆదర్శనీయం. ఇప్పుడే ఇలా ఉంటే.. వచ్చే 10 ఏళ్లలో కల్చర్ ఎలా ఉంటుందో ఊహించుకొంటేనే భయంగా ఉంది. ప్రతీ తండ్రి కన్యాదానం చేసేటప్పుడు నా కూతుర్ని కన్యగానే దానం చేస్తున్నానా? అనే అనుమానం కలుగుతుంది అని కల్యాణి ఆందోళన వ్యక్తం చేశారు.

శివాజీ చేసిన వ్యాఖ్యలపై అర్హత లేని వారే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వారు సరైన రీతిలో సంప్రదాయంగా వ్యవహరించి ఉండి.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తే బాగుంటుంది. కేవలం అర్హత లేని వాళ్లు పాపులారిటీ కోసం కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ గారు కామెంట్స్ చేశారు. మీ ఫ్యామిలీ ట్రిప్‌లో మీరు ఏదైనా చేసుకోండి. దానికి అభ్యంతరం లేదు. మీ ఇంట్లో శుభకార్యానికి పద్దతిగా సంప్రదాయంగా రెడీ అయ్యారు. అలాంటి పద్దతులు పాటించేటప్పుడు సినిమా ఫంక్షన్‌లో ధరించే దుస్తులపై మీకు పట్టింపు ఉండదా? మీకు ఎందుకు కనిపించడం లేదు? నా శరీరం నా ఇష్టం అనడం ఎంత వరకు కరెక్ట్ అని కరాటే కల్యాణి ప్రశ్నించారు.

మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎలాంటి దుస్తులైనా ధరించండి. కానీ పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చేటప్పుడు పద్దతిగా రావాలి. సోషల్ మీడియా సైట్లు పోర్న్ సైట్స్‌గా మారిపోయారు. వాటిపై అనసూయ, చిన్మయి ఎందుకు ప్రశ్నించరు. పాపులారిటీ కోసమే కామెంట్స్ చేస్తున్నారా?. అనసూయ నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.. వారిద్దరూ అసభ్యంగా దుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే మీకు ఇష్టమేనా? మీకు అలాంటి సంస్కృతిలో నీ పిల్లలు ఉంటే బాగుంటుందా? అని కరాటే కల్యాణి కడిగిపడేశారు.

దండోరా సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ మాట్లాడుతూ.. మన హీరోయిన్లు వేసుకొనే బట్టలు చూస్తే మనకే దరిద్రమనిపిస్తుంటుంది. హీరోయిన్లు ఏమనుకొన్నా పర్వాలేదు. మీ అందం నిండుగా కట్టుకొనే చీరలో.. నిండుగా కప్పుకొనే దుస్తుల్లోనే ఉంటుంది తప్పితే.. సామాన్లు కనపించే దుస్తుల్లో ఉండదు. స్త్రీ అంటే ప్రకృతి.. ఎంత అందంగా ఉంటే.. అంత గౌరవం పెరుగుతుంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X