ఒంటి మీద బట్టలు లేకుండా నిలబెట్టి.. ఆ పార్ట్స్ చెక్ చేశారు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలనం
Kasthuri Shankar: అలనాటి హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్ మాలో ప్రసారమైనా ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్ ద్వారా తులసిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె నటి గానే కాకుండా.. అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నారు. తాజాగా ద్రవిడ, తమిళ వాదంలో భాగంగా తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కస్తూరిని అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించిన విషయం తెలిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జైలులో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టింది.
సీనియర్ నటి కస్తూరి శంకర్ అసలు పేరు సుమతి శంకర్. ఫ్యాషన్ రంగంపై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ అడుగుపెట్టింది. ఇలా 1991 లో మిస్ చెన్నైగా గెలుపొందారు. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా సెలక్ట్ అయ్యారు కస్తూరి. ఈ ఫేమ్ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. వరుస విజయాలు అందుకుంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు.

తెలుగులో నిప్పు రవ్వ, గాడ్ ఫాదర్, సొగ్గాడి పెళ్లాం, మెరుపు, చిలక్కొట్టుడు, మా ఆయన బంగారం, ఆకాశ వీధిలో, డాన్ శీను, అన్నమయ్య, శమంతకమణి, సింబా వంటి సినిమాలతో నటించి మెప్పించారు. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అనంతరం సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. ఈ తరుణంలో అమ్మ,అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తూ..క్యారెటర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ఈ తరుణంలోనే బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సీరియల్స్, షోలు చేస్తూ.. ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
సోషల్ మీడియాతో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రాజకీయంగా, వ్యక్తిగతంగా తనదైన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా.. తెలుగు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఓ రాజకీయ సభలో ఆమె మాట్లాడుతూ.. ఇక్కడి అంతఃపురంలోని మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు వచ్చారంటూ కస్తూరి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు అయింది. ఈ కేసులో కస్తూరి శంకర్ మూడు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం కూడా గడిపారు.

తాజాగా నటి కస్తూరి శంకర్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ జైలులో తన అనుభవాల్ని పంచుకున్నారు. జైలు లోపలికి వెళ్లే సమయంలో ఒంటిపై బట్టలు లేకుండా చెక్ చేశారని.. శరీరంపై ప్రతి ఒక్క పార్ట్ ను తడిమీ మరీ పరిశీలించారని చెప్పుకొచ్చింది. పూర్తిగా చెక్ చేసిన తర్వాతే లోపలికి వెళ్తామని కస్తూరి శంకర్ వివరించారు. పుట్టినప్పుడు ఎలా ఉంటామో.. అలాగే చెక్ చేస్తారని నటి తెలిపింది. అయితే చెక్ చేసేవాళ్లు లేడిస్ ఉంటారని తెలిపింది. ప్రైవేట్ పార్ట్స్‌లో ఏమైనా ఉన్నాయా? ఏమైనా దాచానా అనేది కూడా చెక్ చేశారని కస్తూరి శంకర్ చెప్పారు.
అలా.. తనని మూడుసార్లు గుంజీలు తీయించారనీ, ఇదంతా జైలు ఫార్మాలిటీస్ ప్రకారం జరిగినట్లు ఆమె తెలిపారు. జైలులో కిందే పడుకోవాలని, మొదటి, రెండు రోజులు చాలా ఒత్తిడికి ఫీలయ్యానని,ఆ తరువాత తనని తాను కంట్రోల్ చేసుకున్నట్లు నటి కస్తూరీ చెప్పుకొచ్చారు. జైలు జీవితం అంత ఈజీకాదన్నారు. అల్లు అర్జున్‌కు సైతం ఇదే జరిగి ఉంటుందని, రిమాండ్ ఖైదీ ఎవరికైనా ప్రాసెస్ ఇలాగే ఉంటుందన్నారు కస్తూరి శంకర్. ప్రస్తుతం నటి కస్తూరీ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.


Click it and Unblock the Notifications











