‘అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’

వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్ట్‌లతో నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో కస్తూరి శంకర్ ఒకటి. మనసులో ఏం దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు కస్తూరి. అలా పలుమార్లు వివాదాల్లో సైతం చిక్కుకుంటూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయినప్పటికీ ఫైర్‌బ్రాండ్‌గానే అప్పుడప్పుడు ఏదో ఒక బాంబు పేల్చేస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

1991లో ఆతా ఉన్ కోయిలే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కస్తూరి శంకర్. మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. నిప్పు రవ్వ, గాడ్ ఫాదర్, సొగ్గాడి పెళ్లాం, మెరుపు, చిలక్కొట్టుడు, అన్నమయ్య, మా ఆయన బంగారం, ఆకాశ వీధిలో, డాన్ శీను, శమంతకమణి, సింబా వంటి సినిమాలతో తెలుగువారిని సైతం అలరించారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రవికుమార్ అనే వ్యక్తిని పెళ్లాడారు కస్తూరి.

Actress Kasthuri Shankar Reveals Her Funny Addiction to Potato Chips in Viral Interview

పెళ్లి, పిల్లల కారణంగా కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నారు కస్తూరి. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అమ్మ, అక్క, వదిన వంటి పాత్రలు పోషిస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చి సీరియల్స్‌లో దుమ్మురేపారు. స్టార్ మాలో ప్రసారమైన ఇంటింటి గృహలక్ష్మీ ధారావాహిక ద్వారా తెలుగు లొగిళ్లకు కస్తూరి మరింత చేరువయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కస్తూరి శంకర్ తన సినిమాలు, షోలు, ఇతర కార్యక్రమాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 50 ప్లస్‌‌లోనూ హాట్ హాట్ డ్రెస్స్‌ల్లో ఫోటోషూట్స్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు.

నటిగానే కాకుండా లాయర్‌గా, సామాజిక కార్యకర్తగా సమాజానికి సేవలందిస్తున్నారు. ఆడవారి హక్కులు, సమానత్వం, మహిళా సాధికారత తదితర అంశాలపై పోరాడుతున్నారు. మీ టూ ఉద్యమం సమయంలో ఇండస్ట్రీలోని చీకటి కోణాలతో పాటు తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు కస్తూరి. ఇక రెండేళ్ల క్రితం తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. దీనిపై దుమారం రేగడంతో తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. దాంతో కస్తూరి పరారయ్యారు. చివరికి హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో తమిళనాడు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. దాంతో కస్తూరి కొన్నాళ్లు జైలులో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ.. ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.

తెలుగువారిపై నేను అన్న మాటలను వక్రీకరించారు. నేను మాట్లాడిన వీడియోలను కట్ చేసి ఎడిటింగ్ చేశారు. ఇలాంటి మాటలు నా నోటి నుంచి ఎప్పుడూ రావు. తమిళనాడులోని ఓ పార్టీ వాళ్లు నన్ను, నా క్యారెక్టర్‌ను తక్కువ చేయడమే పనిగా పెట్టుకున్నారు. డీఎంకే మూలాలపై నేను మాట్లాడినందుకు నాపై కక్షగట్టారు. స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో తమిళనాడులోని బ్రాహ్మణులంతా గాంధీజీకి మద్ధతుదారులే.. ఆయనను ఎదుర్కోవడానికి నాన్ బ్రాహ్మిణ్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయ్యింది. ద్రవిడియన్ ఉద్యమానికి బొబ్బిలిరాజా, పానగల్ రాజా, త్యాగరాయ, టీవీ నాయర్, రామస్వామి నాయకర్‌. వీరిలో మెజారిటీ తెలుగువారే. వీరి తర్వాత ద్రవిడియన్లుగా ఉంటూ డీఎంకేను నడుపుతున్న కరుణానిధి ఫ్యామిలీ గురించి వారి పార్టీలో ఉన్న వాళ్లందరికీ తెలుసు. ద్రవిడియన్స్ అంటూ ఎవరూ లేరు.. తమిళనాడులో రాజకీయం చేయడానికి ఈ కొత్త సిద్ధాంతాన్ని పుట్టించారు అని కస్తూరి తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో కస్తూరి శంకర్ గారికి ఉన్న పెద్ద వ్యసనం ఏంటో బయటపెట్టేస్తానని యాంకర్ చెప్పగా.. ఆమె సిగ్గుతో తలదాచుకుంది. తమిళనాడులో ఆల్రెడీ నన్ను పెద్ద తాగుబోతునని అనుకుంటున్నారని కస్తూరి చెప్పారు. అయితే నేనే చెప్పేది చూసి ఏమనుకుంటారోనని యాంకర్ సెటైర్లు వేశారు. ఆ వ్యసనం ఏంటీ అంటే రాత్రి 9 గంటలు దాటాక ఒక కోరిక మొదలవుతుంది.. దానిని వద్దు వద్దు అని ఆవిడ ఎంత కంట్రోల్ చేసుకున్నాప్పటికీ కష్టమేనని యాంకర్ తెలిపారు. అప్పుడప్పుడు దానికి నేను లొంగిపోతాను. తర్వాత ఉదయం లేవగానే బాధపడిపోయి ఇంకెప్పుడూ ముట్టుకోకూడదని నిర్ణయం తీసుకుంటాను. కానీ దానికి పూర్తిగా బానిసనైపోయానని కస్తూరి తెలిపారు. ఈ ఆడిక్షన్ ఏదో కాదు బంగాళదుంప చిప్స్ అని యాంకర్ బయటపెట్టేశారు.

దీని వెనుక ఓ స్టోరీ ఉంది. నేను ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటాను కదా? మా అమ్మ చనిపోయాక కేక్‌ని కూడా వదిలేశా. వెజిటేరియన్ కావడంతో గుడ్డు ఉంటుందని దానిని వదిలేశా. దాని వల్ల నాకు కేక్ కూడా తినలేని పరిస్ధితి ఏర్పడింది. ఆ టైంలో జర్మనీ ఉండటం వల్ల ఎగ్ లేకుండా కేక్ దొరికేది కాదు. పాస్తాలో కూడా గుడ్డు ఉంటుంది. తొలి నుంచి బాగా వంట చేస్తాను కాబట్టి నాకు కావాల్సిన విధంగా వండుకునేదానిని. మా నాన్నగారు చనిపోయాక ఉల్లిపాయలు తీసుకోవడం వదిలేయమని మా గురువుగారు చెప్పారు. ఆ మాటలకు దండం పెట్టేసి ఆల్రెడీ తినడానికి ఏం లేదు.. జర్మనీలో ఉల్లిపాయ కూడా లేకపోతే కష్టమని చెప్పా. దాంతో ఆయన పుట్టగొడుగులు తీసుకోవద్దని చెప్పారు. మా అమ్మాయికి ఆరోగ్యం బాగోకపోవడంతో బంగాళదుంప తినడం మానేస్తానని అమెరికా గణేశుడికి మొక్కుకున్నా. అలా పదేళ్ల పాటు చిప్స్ తినడం మానేశా. కానీ ఇప్పుడు కప్పుతో ఇస్తే కప్పు మొత్తం తినేస్తా, పావుకిలో ఇస్తే పావుకిలో తినేస్తా, ఒక్క కిలో ఇస్తే అదంతా ఖాళీ చేసేస్తాను. చివరికి చిప్స్ సైకోగా మారిపోయాను అని కస్తూరి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: kasthuri shankar movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X