తప్పతాగి యాక్సిడెంట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. పోలీసులని బూతులు తిట్టడంతో అరెస్ట్!
ఈ మధ్య కాలంలో మద్యం తాగి యాక్సిడెంట్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు తాగి బండి నడుపుతూ దొరుకుతున్న ఘటనలు కూడా ఎక్కువయ్యాయి. తాజాగా మందేసి కారెక్కిన ఒక హీరోయిన్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ముంబైలో పుట్టి పెరిగి
ముంబైలో అనేక కంపెనీల ప్రొడక్ట్స్ కు మోడల్ గా పనిచేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన కావ్య అనుకోకుండా హిందీ షార్ట్ ఫిలిం తత్కాల్ లో అవకాశం దక్కించుకుని తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. రాహుల్ విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామకు ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే దక్కలేదు.

తెలుగులో కలిసి రాకపోవడంతో
తెలుగులో కలిసి రాకపోవడంతో తమిళంలో 'మార్కెట్ రాజా ఎంబిబిఎస్' అనే సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. అయితే ఆమెకు అక్కడ కూడా క్రేజ్ దక్కలేదు. అయితే ఆమె చివరిగా సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ కథ సినిమాలో ఆమెకు హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 'ఏక్ మినీ కథ' రిలీజ్ అయింది.

వ్యక్తికీ డ్యాష్ ఇచ్చి
ఒకరకంగా ఎన్నో సినిమాలు చేసిన తరువాత ఆమెకు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందింది. అయితే ఆ తరువాత ఆమె మరో సినిమా ఇంకా ఒప్పుకోలేదు. తాజాగా నటి కావ్యా థాపర్‌ను జుహు పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నటి కావ్య మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి, పోలీసులపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా ఓ వ్యక్తి ఆమె కారు కారణంగా గాయపడిన విషయం కూడా తెరపైకి వచ్చింది.

ఘర్షణ పడుతుండటంతో
గురువారం మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ.. ఒక వ్యక్తిని గాయపరిచడంతో పాటు.. పోలీసులను దూషించడం, అవమానపరిచినందుకు కావ్యా థాపర్‌ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత ఆమె జుహూలోని ఓ హోటల్‌లో కొంత మందితో ఘర్షణ పడుతుండటంతో.. పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారమిచ్చారు.

అరెస్ట్ చేసి రిమాండ్ కు
పోలీసులు వచ్చే సమయానికి ఆమె ఇంకా గొడవ పడుతూనే ఉందని, కలగజేసుకున్న మహిళా పోలీస్ కాలర్ పట్టుకుని తీవ్రంగా దూషించడంతో కావ్యా థాపర్‌ను అరెస్ట్ చేసి జుహూ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లుగా ముంబై పోలీస్ జోన్ 9 డీసీపీ మంజునాధ్ తెలిపారు. ఇక ఆమెపై సెక్షన్ 353, 504, 332, 427 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. కాగా, అంధేరీ కోర్ట్‌లో ఆమెను హాజరుపర్చగా.. కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











