ఆ హీరో అంటే పిచ్చి క్రష్.. ఆయనకు గర్ల్‌ఫ్రెండ్‌గా.. రొమాంటిక్‌గా కావ్య థాపర్

ముంబై నుంచి వచ్చి టాలీవుడ్‌లో సెటిలైన ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. నేటికీ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ల కొరతను తీరుస్తున్నారు ముంబై భామలు. అయితే ఇక్కడ సక్సెస్ కొట్టినవారు తక్కువ మందే. అయినప్పటికీ ముంబై హీరోయిన్లు హైదరాబాద్‌కు దిగుమతి అవుతూనే ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు కావ్య థాపర్. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి చాలా కాలమే అవుతున్నా .. నేటికీ ఆమెకు సరైన హిట్ పడలేదు. అయినప్పటికీ తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది కావ్య థాపర్.

చదువు పూర్తి చేసి సినిమాలపై ఆసక్తితో తొలుత షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు కావ్య. 2013లో హిందీలో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అటు మోడల్‌గానూ పతంజలి, మేక్ మై ట్రిప్ సహా దేశంలోని ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఈ దశలో 2018లో వచ్చిన ఈ మాయ పేరిమిటో సినిమా ద్వారా తెలుగువారిని పలకరించారు కావ్య . తెలుగుతో పాటు తమిళంలోనూ సక్సెస్ కొట్టాలని ఓ ప్లాన్ ప్రకారం వెళ్లిన కావ్య థాపర్.. మార్కెట్ రాజా ఎంబీబీఎస్‌తో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు.

Actress Kavya Thapar said that the hero is her first crush

తన చిత్రాలు నిరాశపరిచినా ఎక్కడా కృంగిపోకుండా తెలుగులో వచ్చిన ఏక్ మినీ కథతో కావ్య థాపర్ బ్రేక్ అందుకున్నారు. యువ హీరో సంతోష్ శోభన్‌తో బెడ్‌రూం సీన్స్‌లోనూ ఆమె రెచ్చిపోయారు. తర్వాత బిచ్చగాడు 2, ఈగల్, ఊరి పేరు భైరవ కోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం తదితర చిత్రాల్లో నటించారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సిల్వర్ స్క్రీన్‌తో పాటు ఓటీటీలోనూ కావ్య థాపర్ సత్తా చాటారు. హిందీలో కాలి పిలి టేల్స్, ఫర్జీ , పంజాబీలో క్యాట్ వంటి సిరీస్‌లలో నటించారు.

Actress Kavya Thapar said that the hero is her first crush

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కావ్య థాపర్.. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాల సంగతులు, తన వ్యక్తిగత వివరాలను పంచుకోవడంతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చగొడుతుంటారు. ఈ మధ్యకాలంలో తరచుగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న కావ్య థాపర్ ఇండస్ట్రీలో హీరోయిన్లు, కొత్తగా పరిశ్రమలో అడుగుపెడుతున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మోడల్‌గా నిలదొక్కుకుంటున్న సమయంలో ఓ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగాడని, ఆడపిల్ల హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్నో అడ్డంకులను దాటాలని కావ్య థాపర్ తెలిపారు.

Take a Poll

ఇక సినీ రంగంలో ఇష్టాయిష్టాలను తెలియజేస్తూ తనకు చిన్నప్పటి నుంచి ఓ హీరో అంటే ఇష్టమని, ఆయనే తన ఫస్ట్ క్రష్ అని తెలిపారు కావ్య. ఆ హీరో మరెవరో కాదు షాహిద్ కపూర్. ఆయనతో కలిసి నటించడం జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. వీరిద్దరూ కలిసి ఫర్జీ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 10, 2023న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

More from Filmibeat

Read more about: kavya thapar shahid kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X