క్రష్ లిస్ట్ లో మరో హీరోయిన్.. అప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్లే.. ఇప్పుడు ఏంజెల్ అంటున్నారు!

సౌత్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల సందడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్లు సైడ్ అవుతున్న తరుణంలో యంగ్ బ్యూటీలు ట్రాక్ లోకి వస్తున్నారు. తమ అందం, అభినయం, డ్యాన్స్, క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ వరుసలో ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందన్న నుంచి మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సే, ఆషికా రంగనాథ్ తదితర హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక మందన్న ఇండస్ట్రీని ఏలుతున్న సంగతి తెలిసిందే. మిగితా హీరోయిన్లు కూడా తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.

కాగా తాజాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ క్రష్ లిస్ట్ లోకి చేరిపోయింది. నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళం, తెలుగు ఆడియెన్స్ ను తన అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది. తను ఇచ్చిన బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.... ఇంతకీ ఈ అమ్మడు ఎవరు? ఏ చిత్రంలో నటించి చించేసిందనుకుంటున్నారా?... 'లవ్ టుడే'తో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారిన ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ గా 'డ్రాగన్' చిత్రంతో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Actress Kayadu Lohar is receiving praise for the movie of Pradeep Ranganathan s Dragon She has become a crazy actress

ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చింది. తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'గా విడుదలైంది. తెలుగు, తమిళంలో తొలిరోజే మంచి ఫలితాలను అందుకుంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.49.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందీ చిత్రం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంతో కయాదు లోహర్ పేరు బాగా వినిపిస్తోంది. డ్రాగన్ లో మెయిన్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అయినప్పటికీ... కయాదు లోహర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఎలెమెంట్ గా మారింది. అనుపమాను బీట్ చేసి హీరోయిన్ క్రేజ్ ను లోహర్ అందుకుంది.

'డ్రాగన్'లో ప్రదీప్ రంగనాథన్ కు లోహర్ కు మధ్య సాగే సన్నివేశాలు ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అనుపమా పరమేశ్వరన్ కంటే ఈ ముద్దుగుమ్మ తన పెర్పామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. తమిళ తంబీలనే కాకుండా... తెలుగు ఆడియెన్స్ ల్లోనూ లోహర్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. దీంతో ఆమెకు సౌత్ క్రష్ అనే బిరుదును కూడా ఇస్తున్నారు. త్వరలోనే బిగ్ ప్రాజెక్ట్స్ లో జాయిన్ అయ్యి నేషనల్ క్రష్ గా మారిన ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు.

ఇక కయాదు లోహర్ తెలుగులోనూ ఓ చిత్రం చేసింది. శ్రీవిష్ణు పోలీస్ అధికారికిగా నటించిన 'అల్లూరి'లో కయాదు లోహరే హీరోయిన్. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన ఈ క్రైమ్ డ్రామా ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది. పైగా ఈ చిత్రంలో కయాదు పెర్ఫామెన్స్ ఎందుకో ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకునేలా కనిపించలేదు. దీంతో అప్పుడు ఈమెను ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 'డాగన్'తో హిట్ పడగానే ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X