Keerthy Suresh: సమంత రష్మిక బాటలోనే కీర్తి సురేష్.. అతనిపై కన్నేసిన మహానటి

మహానటి సినిమాతో సూపర్ పాపులర్ అయింది అందాల కేరళ కుట్టి కీర్తి సురేష్. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఇటీవలే దసరా మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ నాయకుడు అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బబ్లీ బ్యూటి ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అయినా సమంత, రష్మిక మందన్నా, రాశీ ఖన్నా బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలనటిగా:మహానటి కీర్తి సురేష్ మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రీల్లో అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రొడ్యూసర్ సురేష్ కుమార్, నటి మేనక కుమార్తెగా సినిమాల్లోకి తెరంగేట్రం చేసిన ఈ కేరళ ముద్దుగుమ్మ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది. 2000 సంవత్సరంలో బాల నటిగా పరిచయం అయింది బ్యూటిఫుల్ కీర్తి సురేష్.

Actress Keerthy Suresh Bollywood Entry With Varun Dhawan Movie

ఆ చిత్రాలతో ఓటమి:చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి కీర్తి సురేష్ మలయాళంలో అనేక చిత్రాలలో అలరించింది. తర్వాత 2013లో విడుదైలన మలయాళ సినిమా గీతాంజలి ద్వారా మొదటగా హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా మహానటితో విపరీతమైన క్రేజ్ అందుకుంది. కానీ, ఆ తర్వాత చేసిన లేడి ఒరియెంటెడ్ సినిమాలు ఓటమి చూశాయి.

Actress Keerthy Suresh Bollywood Entry With Varun Dhawan Movie

ఆయనకు చెల్లెలుగా:ఇటీవల తెలుగులో దసరాతో మంచి హిట్ అందుకున్న కీర్తి సురేష్.. తమిళ చిత్రం 'మామన్నన్' (Maamannan)తో అక్కడ సంచలన సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తెలుగులో నాయకుడుగా విడుదలైంది. ప్రస్తుతం కీర్తి సురేష్ 'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. అలాగే 'రివాల్వర్ రిటా', 'రఘు తాత' సినిమాలు కూడా చేస్తోంది.

Actress Keerthy Suresh Bollywood Entry With Varun Dhawan Movie

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్:ఇలా తెలుగు, తమిళం, మలయాళం వంటి సౌత్ భాషల్లో సత్తా చాటిన కీర్తి సురేష్ ముద్దుగుమ్మలు సామ్, రష్మిక, రాశీ, పూజా హెగ్డే తరహాలో ప్రయాణం చేయాలనుకుంటుంది. త్వరలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ కళావతి. తమిళ దర్శకుడు కాలీస్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి కీర్తి సురేష్ సైన్ చేసిందట. అంతేకాకుండా ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

Actress Keerthy Suresh Bollywood Entry With Varun Dhawan Movie

మే 31న రిలీజ్:కీర్తి సురేష్ నటిస్తున్న హిందీ చిత్రంలో హీరోగా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. ఈ సినిమాను నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది మే 31న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2, రష్మిక మిషన్ మజ్ను, గుడ్ బై, రాశీ ఖన్నా ఫర్జీ వంటి సినిమాలు, వెబ్ సిరీసులతో సందడి చేశారు. ఇప్పుడు వీరి బాటలోనే కీర్తి సురేష్ ప్రయాణం చేస్తుందా అని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X