కీర్తి సురేష్ ఫిట్ నెస్ సీక్రెట్... స్లిమ్ గా ఉండేందుకు ‘మహానటి’ ఏం చేస్తున్నదంటే?

యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. నేచురల్ స్టార్ నాని ఈ ముద్దుగుమ్మను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నాని సరసన ' నేను లోకల్' చిత్రంలో నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కీర్తి సురేష్ కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రామ్ పోతినేని సరసన ' నేను శైలజ' చిత్రంలో నటించి ఆడియన్స్ కు మరింతగా దగ్గర అయింది. ఆ తర్వాత నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస చిత్రాలు చేసింది.

కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలో కీర్తి సురేష్ తో ' మహానటి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ అచ్చం అలనాటి నటి సావిత్రిని గుర్తు చేసేలా నటించింది. ఆమె నటనకు గాను ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కడంతోపాటు ఏకంగా నేషనల్ అవార్డును ఉత్తమ నటి కేటగిరీలో అందుకుంది. ఆ తర్వాత నుంచి కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. పెద్ద హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది.

Actress Keerthy Suresh Fitness Secret Here is Heroine special Workout Video

చివరిగా కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ' గుంటూరు కారం' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ తన గ్లామర్ తో ప్రేక్షకులను మైమరిపించింది. అంతేకాదు ఫిట్నెస్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబుకే పోటీనిచ్చింది. అది కీర్తి సురేష్ ఎప్పుడు స్లిమ్ గా కనిపించేందుకు ఏం చేస్తుంది అనే రహస్యం చాలామందికి తెలిసి ఉండదు. కీర్తి సురేష్ అనే కాదు సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడంతో పాటు ఎప్పుడు ఫిట్ గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అందుకు పలు రకాల డైట్లు, స్పెషల్ వర్కౌట్స్ చేస్తుంటారు.

ఇక కీర్తి సురేష్ తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి తెలియజేసే ఇంట్రెస్టింగ్ వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. కీర్తి సురేష్ రెగ్యులర్ గా తన హెల్త్ ను కాపాడుకునేందుకు పలు రకాల వ్యాయామాలు చేస్తుందని తాజాగా పంచుకున్న వీడియోతో అర్థం అవుతుంది. గతంలో యోగ ఫోజులతో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఒక రకమైన వర్క్ అవుట్ చేస్తూ కనిపించింది. శరీరంలోని ప్రతి అవయవం పై వెయిట్ పడేలా, ఫ్యాట్ కరగదీసేలా మెలికలు తిరుగుతూ కనిపించింది. ఇక సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. దాంతో ఫిట్నెస్ పై కీర్తి సురేష్ తన అభిమానులకు స్ఫూర్తిని నింపుతోంది.

ఇక పెళ్లయిన తర్వాత కీర్తి సురేష్ బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయింది. చివరిగా క్రేజీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ' బేబీ జాన్'లో నటించి ఆడియన్స్ను అలరించింది. అంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఫ్యాన్ ఇండియా మూవీ ' కల్కి 2898 ఏడీ' చిత్రంలో తన వాయిస్ ఓవర్ అందించి ఆకట్టుకుంది. బుజ్జి కి తన బ్యూటిఫుల్ వాయిస్ అందించిన సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ రివాల్వర్ రిటా, కన్నివేడి వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా 2024లో ఈ ముద్దుగుమ్మ తన స్నేహితుడు ఆంటోనీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

More from Filmibeat

Read more about: keerthy suresh movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X