స్పోర్ట్స్ బ్రాలో కీర్తి సురేష్ అరాచకం: ముందుకు వంగి మరీ బోల్డుగా!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవడం పెద్ద మేటర్ కాదు. కానీ, వాళ్లు స్టార్లుగా ఎదగడమే గొప్ప విషయం. అలాంటిది ఇప్పుడు టాలీవుడ్‌లో కొందరు భామలు తమదైన రీతిలో హవాను చూపిస్తోన్నారు. అందులో కీర్తి సురేష్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ సత్తా చాటుతోన్న ఈ చిన్నది.. సౌతిండియా మొత్తం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిని మీరూ చూడండి!
చిన్నప్పుడే.. టాలీవుడ్‌లోకి: కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్టుగా చాలా చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే 'గీతాంజలి' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి పరిచయం అయింది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఆఫర్లను తెచ్చిపెట్టింది.

నేషనల్ అవార్డుతో క్రేజీగా: కీర్తి సురేష్ 'నేను శైలజ' తర్వాత తెలుగులో ఏకధాటిగా సినిమాలు చేసి సత్తా చాటింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి లీడ్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా సొంతం అయింది.
దసరాతో మరో క్రేజీ హిట్: కెరీర్ తొలినాళ్లలో కీర్తి సురేష్ వేరే భాషల్లో ఎక్కువ సినిమాలు చేసినా.. స్టార్‌గా మారిన తర్వాత మాత్రం తెలుగు చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఉత్సాహంతోనే గత ఏడాది వరుసగా 'గుడ్ లక్ సఖి', 'సర్కారు వారి పాట', 'వాషీ', 'సానీ కాయిదామ్' అనే సినిమాలు చేసింది. ఇక, ఇటీవలే నాని 'దసరా' మూవీతో వచ్చి పాన్ ఇండియా రేంజ్‌లో హిట్‌ను కొట్టింది.

ప్రస్తుతం ఆ సినిమాల్లోనే: సౌతిండియాలోని అన్ని భాషల్లోనూ హవాను చూపిస్తోన్న కీర్తి సురేష్.. ప్రస్తుతం 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. వీటితో పాటు 'మామన్నన్', 'సిరేన్', 'రఘు తాతా', 'రివాల్వర్ రీటా' అనే తమిళ సినిమాల్లోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైతం కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తీరిక లేకుండా గడుపుతోంది.
సోషల్ మీడియాలో బిజీ: తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది.

అప్పుడప్పుడూ వాటితో: సోషల్ మీడియాలో సౌతిండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె కాసింత గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

కీర్తి సురేష్ పిక్స్ వైరల్: తాజాగా మహానటి కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రాతో దర్శనమిచ్చింది. పైగా ఈ ఫొటోలో ఈ హీరోయిన్ కింద పడుకుని మరీ తన కుక్కపిల్లతో ఆడుకుంటోంది. ఫలితంగా ఈ పిక్స్‌లో కీర్తి అందాలు కనిపించి కనిపించనట్లుగా ఉన్నాయి. దీంతో వీటికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











