కీర్తి సురేష్ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఇంత ఘాటుగా ఎప్పుడూ చూపించలేదుగా!
సినీ రంగంలోకి ఎంతో మంది హీరోయిన్లుగా వచ్చినా.. కొందరు మాత్రమే అందం, అభినయంతో మెప్పించి స్టార్లుగా మారుతున్నారు. అందులోనూ కొందరైతే దేశ వ్యాప్తంగా పేరు, ప్రతిష్టలను సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ ఒకరు. చాలా కాలంగా దక్షిణాది మొత్తంలో హవాను చూపిస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ పాగా వేసేలా దూసుకెళ్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా కీర్తి కొన్ని బోల్డు పిక్స్ వదిలింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!
చైల్డ్ ఆర్టిస్ట్.. హీరోయిన్‌గా
చైల్డ్ ఆర్టిస్టుగా కీర్తి సురేష్ చాలా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'గీతాంజలి' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాల్లో ఫీమేల్ లీడ్‌గా చేసింది. ఈ క్రమంలోనే రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి పరిచయం అయింది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు గుర్తింపుతో పాటు ఆఫర్లు వచ్చాయి.

మహానటితో అవార్డులు
'నేను శైలజ' తర్వాత కీర్తి సురేష్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ భాగం అయింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా లభించింది.
హిట్లు ఫ్లాపులతో కెరీర్
మొదట్లో కాస్త స్లోగానే సినిమాలు చేసిన కీర్తి సురేష్.. స్టార్‌గా మారిన తర్వాత మాత్రం జెట్ స్పీడుతో మూవీలు చేసింది. ఇలా 2022లో వరుసగా 'గుడ్ లక్ సఖి', 'సర్కారు వారి పాట', 'వాషీ', 'సానీ కాయిదామ్' అనే సినిమాలు చేసింది. ఇక, 2023లో 'దసరా', 'నాయకుడు', 'భోళా శంకర్' వంటి చిత్రాలతో వచ్చింది. కానీ తెలుగులో పెద్దగా మెప్పించలేదు.

ఇప్పుడా మూవీలతోనే
దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ హవాను చూపిస్తోన్న కీర్తి సురేష్.. ఇప్పుడు ఈ బ్యూటీ 'సైరన్', 'రఘు తాతా', 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి' అనే తమిళ సినిమాల్లోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైతం కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ముఖ్యంగా ఇప్పుడు కీర్తి 'బేబీ జాన్' అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది.
అందులో ఫుల్ బిజీగా
సౌత్ నుంచి నార్త్ వరకూ చాలా భాషల్లో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోన్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలనూ షేర్ చేస్తోంది.

అప్పుడప్పుడూ ట్రీట్
సౌతిండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా కాలంగా హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె కాసింత గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
కీర్తి సురేష్ పిక్స్ వైరల్
మహానటి కీర్తి సురేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చీరకట్టులోనే దర్శనమిచ్చింది. కానీ, పైటను పక్కకు జరిపి మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌లో కీర్తి అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











