For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహానటి కీర్తి సురేష్ అందాల వల: తొలిసారి అలాంటి డ్రెస్‌లో హాట్ షో

  |

  ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ చిన్నది.. తెలుగులోనే కాదు.. దక్షిణాది మొత్తంలో సందడి చేస్తోంది. అలా చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కీర్తి సురేష్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

  అలా పరిచయం.. తెలుగులోకి

  అలా పరిచయం.. తెలుగులోకి

  చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్.. అదే భాషలో వచ్చిన 'గీతాంజలి' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు పేరు తెచ్చింది.

  షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!

  మహానటిగా జాతీయ అవార్డ్‌తో

  మహానటిగా జాతీయ అవార్డ్‌తో

  కీర్తి సురేష్ 'నేను శైలజ' తర్వాత తెలుగులో వరుస సినిమాలతో సందడి చేసింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది.

  ఆ భాషల్లోనూ.. కీర్తి ఫుల్ బిజీగా

  ఆ భాషల్లోనూ.. కీర్తి ఫుల్ బిజీగా

  కెరీర్ ఆరంభంలోనే కీర్తి సురేష్ మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా మారిపోతోంది. దీంతో అన్ని చోట్లా ఆమెకు ఆదరణ, డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది.

  Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!

  కీర్తి సురేష్ పెళ్లి.. ఫుల్ హైలైట్

  కీర్తి సురేష్ పెళ్లి.. ఫుల్ హైలైట్

  కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపించడంతో పాటు మరిన్ని అవకాశాలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి గురించి తరచూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో ఆమె ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయిందని ఓ న్యూస్.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడిని వివాహం చేసుకోబోతుందని ఇంకో వార్తతో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

  సోషల్ మీడియాలో సందడిగా

  సోషల్ మీడియాలో సందడిగా

  దక్షిణాదిలోని అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. ఫలితంగా ఈ అమ్మడు తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

  బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్

  అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్

  సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవడంతో పాటు వార్తల్లో నిలుస్తోంది.

  కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్ వైరల్

  కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్ వైరల్

  తాజాగా మహానటి కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె దారాలు దారాలు చుట్టుకున్నట్లు ఉన్న డ్రెస్‌ను ధరించింది. పైగా ఇందులో తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.

  English summary
  South Indian Actress Keerthy Suresh Very Active in Social Media. Now She Shares Hot Photos in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X