Keerthy Suresh మ్యారేజ్ ప్లాన్ షురూ.. అందుకే ఆ విధంగా సరికొత్త నిర్ణయం!

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కీర్తి సురేష్ పలు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఇక ఈ మహానటి త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు మరోసారి వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల వారి కుటుంబ సభ్యులు నిర్ణయం ప్రకారం కీర్తి సురేష్ పెళ్లి పనులు కూడా మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమె ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

మంచి నటిగా గుర్తింపు

మంచి నటిగా గుర్తింపు

నేను శైలజ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మరికొన్ని విభిన్నమైన సినిమాలతో మంచి క్రేజ్ అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ బ్యూటీకి మంచి విజయాలు దక్కాయి. ముఖ్యంగా మహానటి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

గతంలోనే లవ్ రూమర్స్

గతంలోనే లవ్ రూమర్స్

ఇప్పుడిప్పుడే కీర్తి సురేష్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. అయితే ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని వైరల్ అవుతూనే ఉన్నాయి. గతంలోనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తో కూడా ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు అని వారి కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

సైలెంట్ గా ఉండడంతో

సైలెంట్ గా ఉండడంతో

అలాగే కీర్తి సురేష్ ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది అని అతనితో త్వరలోనే ఏడు అడుగులు వేయబోతోంది అని కూడా తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంపై కొన్నాళ్లు కీర్తి సురేష్ సైలెంట్ గా ఉండడంతో దాదాపు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది అనే విధంగా వార్తలు వచ్చాయి. కానీ అందులో కూడా నిజం లేదు అని ఆమె తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు.

 సినిమా బ్యాక్ గ్రౌండ్

సినిమా బ్యాక్ గ్రౌండ్

కీర్తి సురేష్ తల్లి మేనక అప్పట్లో హీరోయిన్ గా గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె తండ్రి సురేష్ మలయాళం సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే వారి తల్లిదండ్రుల కోరిక మేరకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు అందుకుంది. అయితే ఎప్పుడైనా సరే తన తల్లిదండ్రుల నిర్ణయం ప్రకారం పెళ్లి జరుగుతుంది అని కూడా ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

 పెళ్లి పనులు మొదలు..

పెళ్లి పనులు మొదలు..

అయితే ఇటీవల సైలెంట్ గా కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టినట్లుగా కొన్ని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే ఇటీవల వారు సంప్రదాయం ప్రకారం కేరళలోని కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించినట్లుగా తెలుస్తోంది. కీర్తి సురేష్ ఇటీవల వల్ల కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ పెళ్లి కోసం సిద్ధమవుతూ ఉండడంతో కొత్త సినిమాలను కూడా ఓకే చేయడం లేదు అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రెగ్యులర్ హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

పెళ్లి కొడుకు ఎవరు?

పెళ్లి కొడుకు ఎవరు?

కీర్తి సురేష్ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే విషయంలో ఇంతవరకు ఎవరు కూడా అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ మలయాళం మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే వారికి తెలిసిన బంధువుల అబ్బాయిని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని కథనాలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ నానితో దసరా సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని తమిళ సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్గా నటిస్తోంది. మరి మ్యారేజ్ విషయంలో కీర్తి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X