కీర్తి సురేష్ చేయి పట్టుకున్న కుర్రాడు.. వందల మంది చూస్తుండగానే!
తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టితో వివాహం తర్వాత కీర్తి సురేష్ చిల్ అవుతున్నారు . రెండు సినిమాలను అనౌన్స్ చేసినప్పటికీ ఫ్రీ టైమ్‌లో వెకేషన్‌లకు వెళ్తున్నారు . తొలి నుంచి సరదాగా తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉంటారు కీర్తి సురేష్. తను ఎక్కడుంటే అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా మార్చేస్తుంది. తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
తక్కువ కాలంలోనే సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. ముద్దుగా, బొద్దుగా ఉండే కీర్తికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండేది. తొలినాళ్లలో ఈమె నటించిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఐరన్ లెగ్ ముద్రను కూడా వేసుకుంది. అయితే మహానటి సినిమా తర్వాత కీర్తి లైఫ్ మారిపోయింది. నాటి నుంచి ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు తెచ్చుకున్న కీర్తి .. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో టాప్ హీరోల సరసన నటి్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.

స్కీన్ షోకు, అందాల ఆరబోతకు దూరంగా హోమ్లీ క్యారెక్టర్లు చేస్తూ అలరించిన కీర్తి సురేష్.. ఈ హద్దులను చెరిపివేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్‌గా వెలగాలంటే పద్ధతిగా కనిపిస్తూ కూర్చోకూడదని గ్రహించింది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ .. కుర్ర హీరో వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ అనే సినిమాలో నటించి హిందీలో తన అదృష్టం పరీక్షించుకుంది. ఇందులో అందాల ఆరోబోతతో పాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ దుమ్మురేపింది. తన పెళ్లిని , హనీమూన్‌ని కూడా పక్కనపెట్టి ఈ సినిమా కోసం ప్రమోషన్ చేసింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తూ బేబీ జాన్ ఫ్లాప్ అయ్యింది.
తొలి హిందీ సినిమాయే ఫ్లాప్ అయినప్పటికీ నిరాశ చెందకుండా బాలీవుడ్‌లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కీర్తి సురేష్. తాజాగా కీర్తికి రెండో సినిమాలో అవకాశం దక్కినట్లుగా బీటౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు? హీరో ఎవరు? అన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతానికి కీర్తి సురేష్‌తో కథా చర్చలు, ఇతర సంప్రదింపులు చేస్తోందట చిత్ర యూనిట్. దీనితో పాటు తమిళంలో రివాల్వర్ రిటా, కన్నివేడి సినిమాలలో నటిస్తున్నారు కీర్తి సురేష్.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా టర్కీష్ ఐస్ అమ్మే వ్యక్తులు ఐస్‌క్రీమ్ ఇచ్చినట్లే ఇచ్చి ఆట పట్టిస్తుంటారు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్లు వదిలిపెట్టరు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ వీళ్లకి దొరికిపోయింది.
టర్కీష్ ఐస్‌క్రీమ్ తినేందుకు ఓ చోటికి వెళ్లిన కీర్తి సురేష్‌ను అక్కడి విక్రేత ఇలాగే ఆడుకున్నాడు. ఆమె కూడా దానిని సరదాగా ఎంజాయ్ చేశారు. అయితే డబ్బులు ఇచ్చే సమయంలో కరెన్సీ నోట్లను అటు ఇటూ తిప్పుతూ రివెంజ్ తీర్చుకున్నారు కీర్తి సురేష్. చివరికి ఐస్ క్రీమ్ షాప్ వ్యక్తి కీర్తి చేయిని గట్టిగా పట్టుకుని డబ్బు లాక్కోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











