బికినీ వేసుకోమంటే.. నిర్మాతకు దిమ్మతిరిగే షాకిచ్చిన కీర్తీ సురేష్

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా సరే కెరీర్ మొదట్లో ఉన్నట్లుగా ఆ తరువాత ఉండలేరు. గ్లామర్ షోను నేటితరం ట్రెండ్ కి తగ్గట్టుగా పెంచుతూనే ఉంటారు. గ్లామర్ డోస్ పెంచకుండా ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక కీర్తి సురేష్ లాంటి క్యూట్ బ్యూటీ కూడా స్లోగా గ్లామర్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కానీ ఆమె హద్దులు దాటడం లేదు.

 హ్యాట్రిక్ హిట్స్..

హ్యాట్రిక్ హిట్స్..

కెరీర్ ని మలుపు తిప్పడానికి ఒకే ఒక్క అవకాశం చాలు. కీర్తి సురేష్ కి కూడా అలాంటి ఆఫర్స్ బాగానే వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె పట్టిందల్లా బంగారం అయ్యింది. నేను శైలజా, నేను లోకల్ సినిమాలతో పాటు మహానటి సినిమా కూడా ఆమె మంచి గుర్తింపు తెచ్చింది. ముఖ్యంగా మహానటి ఆమె కెరీర్ లోనే ఒక బెస్ట్ ఫిల్మ్ అని చెప్పవచ్చు.

 ఆ తరువాత కనిపించలేదు..

ఆ తరువాత కనిపించలేదు..

సావిత్రి బయోపిక్ మహానటి సినిమా చేసిన తరువాత మళ్ళీ కీర్తి సురేష్ కథానాయికగా మరో తెలుగు సినిమా రాలేదు. మన్మథుడు 2లో కేవలం ఒక గెస్ట్ రోల్ చేసింది. ఇక తమిళ్ రీమేక్ సర్కార్ ఒక విధంగా తెలుగులో కూడా బాగానే ఆడింది కాబట్టి అమ్మడిని తెలుగు ఆడియెన్స్ పెద్దగా మిస్ అవ్వలేదని చెప్పవచ్చు. కానీ కీర్తి డైరెక్ట్ తెలుగు సినిమా చేసి దాదాపు రెండేళ్లవుతోంది.

గ్లామర్ రోల్స్..

గ్లామర్ రోల్స్..

మహానటి సినిమా వరకు కీర్తి సురేష్ గ్లామర్ రోల్స్ కి చాలా దూరంగా ఉంది. కొంచెం కూడా హాట్ గా కనిపించకుండా కుర్రాళ్లను తన స్మైల్ తోనే ఎట్రాక్ట్ చేసింది. ఇకపోతే సర్కార్ సినిమాలో మాత్రం కాస్త గ్లామర్ టచ్ ఇవ్వక తప్పలేదు. పాత్ర డిమాండ్ చేస్తే డోస్ పెరగకుండా అవసరం ఉన్నంతవరాకే గ్లామర్ రోల్స్ చేస్తానని చెబుతోంది.

Recommended Video

Producer C Kalyan About Tollywood Problems During Lockdown
బికినీ వేస్తే బావుండదని..

బికినీ వేస్తే బావుండదని..

కీర్తి సురేష్ బాలీవుడ్ వైపు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది. ఆ మధ్య అజయ్ దేవ్ గన్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ ఎందుకో మిస్ అయ్యింది. ఇక మరికొన్ని ఆఫర్స్ వస్తున్నప్పటికీ అందులో కొన్ని తనకు సెట్టవ్వవని నో చెబుతోందట. ముఖ్యంగా బికినీలో కనిపించాలని కూడా ఒక భారీ బడ్జెట్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ కీర్తి నో చెప్పిందట. కథ బావున్నప్పటికి ఫ్యాన్స్ నన్ను అలా చూడాలని అనుకోవడం లేదని డైరెక్ట్ గా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X