twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్‌గా కీర్తీ సురేష్ వీడియో.. నెటిజన్లు మరింత క్రేజీగా!

    |

    విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో ఆకట్టుకొంటున్న మహానటి ఫేమ్ కీర్తీ సురేష్‌ తన సామాజిక బాధ్యతను గుర్తు చేసుకొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న సమయంలో తన బాధ్యతగా ఓ వీడియో ద్వారా ప్రజలకు కొంత అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆమె... అందులో అభిమానులు, ప్రజలకు కొన్ని సలహాలు ఇస్తూ...

    కరోనావైరస్‌కు అడ్డుకట్ట వేస్తూ బాధితుల సంఖ్యను తగ్గించాలంటే డబుల్ మాస్క్ ధరించాలి. శానిటైజ్‌ను ఉపయోగించాలి. సోషల్ డిస్టెన్స్‌ మెయింటెన్ చేయాలి. ఎక్కువ జనం ఉన్న ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలి. శారీరంగా రోగ నిరోధక శక్తిని పెంచుకొనేందుకు ప్రయత్నించాలి ప్రభుత్వం నిబంధనలు తప్పకుండా పాటించాలి అని తన వీడియోలో సూచించారు.

    Actress Keerthy Suresh shared a Video to create awareness on Covid Vaccine

    ఇక తాను కరోనాను ఎదురించడానికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకొన్నాను. మీరు కూడా తీసుకోవాలని కోరుతున్నానని ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనావైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపింది. అంతేకాకుండా మన ఫ్యామిలీని మనం రక్షించుకోవచ్చు అని కీర్తీ సురేష్ తన వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను క్రేజీగా నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

    కోవిడ్ పరిస్థితుల్లో అవగాహన కల్పించడానికి తీసుకొన్న చొరవ నేపథ్యంలో కీర్తీ సురేష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు వీడియోల ద్వారా తమదైన సందేశాలను ఇస్తున్నారు.

    ఇక కీర్తీ సురేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రజనీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్‌లో వస్తున్న అన్నాతే చిత్రంలో నటిస్తు్నారు. అలాగే సెల్వరాఘవన్‌తో సానీ కాయిధమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

    English summary
    Actress Keerthy Suresh shared a Video to create awareness on Covid Vaccine. Our KeerthyOfficial. She asked to wear double mask.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X