Keerthy Suresh : హనీమూన్‌లో భర్తతో ఏకాంతంగా కీర్తి సురేష్ .. దెబ్బకి జరమొచ్చేసిందిగా!
30 ప్లస్ దాటినా ఎంతో మంది హీరోయిన్లు పెళ్లి మాటెత్తడం లేదు. ఇక పలువురు హీరోలు, ఇతర సెలబ్రెటీలతో ప్రేమాయణం సాగించేవారు ఎందరో. అలాంటిది 15 ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నా ఎక్కడా ఆ విషయం బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు మహానటి కీర్తి సురేష్. అందరిలా కాకుండా , వయసు ముదిరిపోకముందే మూడు ముళ్లు వేయించుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేసింది కీర్తి.
మలయాళ నిర్మాత జీ సురేష్ కుమార్, అలనాటి అందాల తార మేనకా దంపతుల కుమార్తె కీర్తి సురేష్. బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో పెద్దగా కష్టపడకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కీర్తి సురేష్. కానీ అది కేవలం లాంచింగ్ వరకే ఉపయోగపడింది. కానీ హీరోయిన్ అయ్యాక ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఐరెన్ లెగ్ అనిపించుకుంది. కానీ ఎక్కడా కృంగిపోకుండా నటనకు మెరుగులు దిద్దుకుని విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది.

నేను శైలజతో తెలుగు వారిని పలకరించిన కీర్తి సురేష్‌కు ఆ సినిమా విజయం సాధించడంతో అవకాశాలు క్యూకట్టాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్తున్న దశలో మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ 'మహానటి'లో టైటిల్ రోల్ పోషించే అవకాశం దక్కించుకుని ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. గ్లామర్ పాత్రలు చేసుకుంటూ , నటన రాదనే విమర్శలు ఎదుర్కొన్న కీర్తి సురేష్ ఈ సినిమా ద్వారా తనలోని అసలు సిసలు నటిని బయటికి తీసుకొచ్చింది.
అచ్చుగుద్దినట్లు సావిత్రిలా నటించి శెభాష్ అనిపించుకోవడమే కాదు.. ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు కీర్తి సురేష్. మహానటి తర్వాత ఆమె చేసిన సినిమాలు ఒకదానికొకటి నిరాశ పరిచాయి. ఈ దశలో గతేడాది విడుదలైన దసరా, మామన్నన్ చిత్రాలతో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చారు కీర్తి సురేష్. గతేడాది సైరన్, రఘుతాత చిత్రాలలో నటించిన ఆమె.. ప్రస్తుతం రివాల్వర్ రీటా, కన్నివేడి, ఉప్పుకప్పురంబులు చేస్తున్నారు.
గోవాలో తన ప్రియుడు ఆంటోనీ తట్టితో హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లిళ్లు చేసుకున్న కీర్తి సురేష్ మెడలో పసుపు తాడుతోనే తన హిందీ డెబ్యూ బేబీజాన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందుకోసం తన హనీమూన్‌ను కూడా వాయిదా వేసుకున్నారు. ఇంత శ్రమించినప్పటికీ బేబీ జాన్ ఫ్లాప్ కావడంతో ఆమె షాక్‌లో ఉన్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు ముగిసి, సినిమా విడుదలయ్యాకే భర్తతో కలిసి హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లారు కీర్తి సురేష్.
అక్కడి ఫుకెట్‌లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పనిలో పనిగా న్యూఇయర్ సెలబ్రెషన్స్ కూడా జరుపుకున్న కీర్తి సురేష్ దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో దుప్పటి కప్పుకుని థర్మామీటర్ నోట్లో పెట్టుకోగా.. అప్పుడే జ్వరం వచ్చిందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











