హాట్ షోతో షాకిచ్చిన కీర్తి సురేష్: ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వేరే రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలే స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతోన్నారు. తద్వారా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ ఒకరు. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సుందరాంగి.. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటోంది. అదే సమయంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే కీర్తి సురేష్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. టాలీవుడ్‌లో సత్తా

అలా ఎంట్రీ.. టాలీవుడ్‌లో సత్తా

మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసిన కీర్తి సురేష్.. అదే భాషలో వచ్చిన 'గీతాంజలి' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమె తెగ హైలైట్ అయింది.

మహానటి అనిపించుకున్న కీర్తి

మహానటి అనిపించుకున్న కీర్తి

'నేను శైలజ' తర్వాత తెలుగులో కీర్తి సురేష్ వరుస సినిమాలతో సత్తా చాటింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాలు కూడా చేసింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి టైటిల్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఈ చిత్రానికి గానూ ఆమెకు జాతీయ అవార్డు సైతం దక్కింది.

అన్ని భాషలూ... ఫుల్ బిజీగానే

అన్ని భాషలూ... ఫుల్ బిజీగానే

కీర్తి సురేష్ హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే మలయాళం, తమిళంలో పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో అన్ని చోట్లా ఆమెకు ఆదరణ లభించడంతో దూసుకెళ్తోంది.

కీర్తి సురేష్ పెళ్లి.. హాట్ టాపిక్‌గా

కీర్తి సురేష్ పెళ్లి.. హాట్ టాపిక్‌గా


మహానటి కీర్తి సురేష్ చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి గురించి తరచూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో ఆమె ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయిందని ఓ న్యూస్.. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడిని వివాహం చేసుకోబోతుందని మరో వార్త.. ఇలా ఎన్నో హైలైట్ అయ్యాయి.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ


వరుసగా మూవీల మీద మూవీలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. ఫలితంగా ఈ అమ్మడు తన ఫాలోయింగ్‌ను ఇంకాస్త పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోన్న నటి

అందాలను ఆరబోస్తోన్న నటి

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాల ఆరబోత మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగానే గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవడంతో పాటు నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

కీర్తి సురేష్ ఫొటోలు వైరల్‌గా

కీర్తి సురేష్ ఫొటోలు వైరల్‌గా


మహానటి కీర్తి సురేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎల్లో కలర్ బ్లేజర్ ధరించి విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ అందాల విందు చేస్తోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఈ పిక్స్ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X