ఏమీ వేసుకోకుండా కీర్తి సురేష్ సెల్ఫీ: ఇంత ఘోరంగా ఎప్పుడూ చూసుండరు
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్లు వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే భారీ సినిమాల్లో భాగం అవుతూ స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అందులో మహానటి కీర్తి సురేష్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తోన్న ఈ భామ.. భారీ అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇలా దక్షిణాది మొత్తం హవాను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోంది. ఇక, సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి!

అలా వచ్చి.. తెలుగులోనూ: మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి సురేష్.. అదే భాషలో 'గీతాంజలి' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేసింది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు గుర్తింపును తెచ్చింది.

జాతీయ అవార్డు సొంతం: 'నేను శైలజ' తర్వాత కీర్తి సురేష్ తెలుగులో వరుస సినిమాలతో హడావిడి చేసింది. అలాగే, బడా స్టార్లతో భారీ చిత్రాల్లోనూ భాగమైంది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి టైటిల్ రోల్‌లో నటించింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా పేరు వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతమైంది.

దసరాతో భారీ విజయం: ఆరంభంలో కీర్తి సురేష్ మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ఉత్సాహంతోనే గత ఏడాది వరుసగా 'గుడ్ లక్ సఖి', 'సర్కారు వారి పాట', 'వాషీ', 'సానీ కాయిదామ్' అనే సినిమాలు చేసింది. ఇక, ఇటీవలే నాని 'దసరా' మూవీతో మరో భారీ పాన్ ఇండియా హిట్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది.

ఆ సినిమాల్లో నటిస్తోంది: దక్షిణాది మొత్తంలో హవాను చూపిస్తూ వరుసగా సినిమాలు చేస్తోన్న మహానటి కీర్తి సురేష్.. ప్రస్తుతం 'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. వీటితో పాటు 'మామన్నన్', 'సిరేన్', 'రఘు తాతా', 'రివాల్వర్ రీటా' అనే తమిళ సినిమాల్లోనూ నటించింది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైతం కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి యమ బిజీగా మారిపోయింది.

అందులో యమ బిజీగా: సౌత్‌లోని దాదాపు అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. ఫలితంగా ఈ అమ్మడు క్రేజ్‌ను పెంచుకుంటోంది.
గ్లామర్ షోతో రెచ్చిపోతూ: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె కాసింత గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతూ వస్తోంది.

కీర్తి సురేష్ పిక్ వైరల్‌గా: మహానటి కీర్తి సురేష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రాతో పాటు టైట్ జిమ్ ట్రాక్ ధరించింది. పైగా ఈ ఫొటోలో ఈ హీరోయిన్ మేకప్ ఏమీ వేసుకోలేదు. దీనికితోడు ఎంతో బక్కగా (సన్నగా) కనిపిస్తోంది. ఫలితంగా ఈ పిక్ చూసిన వాళ్లందరూ అందులో ఉన్నది కీర్తి సురేషేనా అని డౌట్ పడుతున్నారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











